నిజామాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి కేక్‌కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం నగేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఒక పక్క సంక్షేమాన్ని, మరోపక్క అభివృద్ధిని రాష్ట్రంలో సమానంగా నడిపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకష్ణ మాట్లాడుతూ.. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా వచ్చి పార్టీని ముందుండి నడిపించి, అధికారంలోకి తీసుకుచ్చారన్నారు. మేయర్ ఉమారాణి, నూడ చైర్మన్ కేశవే ణు, డీసీసీబీ చైర్మన్ రమేష్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, భక్తవత్సలం, రత్నాకర్, కౌడపు శరత్‌కుమార్, యాదగిరి, మీసాల సుధాకర్, శ్రీనివాస్, గంగారెడ్డి, రామార్తి గోపి, రాజేంద్ర ప్రసాద్, అన్వర్, మనోహర్, కోనేరు సాయికుమార్, మఠం రేవతి తదితరులు పాల్గొన్నారు.


