నందిపేట్ మండలంలోని బజార్ కొత్తూర్ శివారులో నారు తీసి నాట్లు వేస్తున్న మహిళాకూలీలు
ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, వరి జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం చెబుతున్నా.. ముందస్తుగా వరినాట్లు వేస్తే ముప్పు ఉండబోదని పలువురు రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి విత్తనాలు వేసి నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. నందిపేట మండలంలోని బజార్కొత్తూర్కు చెందిన రైతు గోపు ముత్యం ఆదివారం నాట్లు సైతం పూర్తి చేశాడు. ఇలా ఎంతో మంది రైతులు వేసవి కాలం ప్రారంభానికి ముందే పంటలు చేతికొచ్చేలా ముందస్తుగా వరినాట్లు వేస్తున్నారు. – నందిపేట్(ఆర్మూర్)


