ఆర్మూర్: వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ (వాల్టా) 2002 ప్రకారం.. బోరు వేసేందుకు తప్పనిసరిగా తహసీల్దార్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తాగునీటి వనరులకు 250 మీటర్ల లోపు బోరు వేయొద్దు. 2026 నవంబర్ 4వ తేదీన ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 259 ప్రకారం 2027 జూలై 31 వరకు అనుమతి లేకుండా కొత్త బోరు వేస్తే బోరును సీజ్ చేయడంతోపాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరి మానా విధిస్తారు. కమర్షియల్, అపార్ట్‌మెంట్, హో టల్స్, రైస్‌మిల్లులకు ఎన్‌వోసీ తప్పనిసరి చేశారు. ప్రస్తుతం భూగర్భ జలమట్టం అడుగంటుతుండడంతో రోజుకు మూడు నాలుగు కొత్త బోర్లు పట్టణాల్లోనే వేస్తున్నారని, గ్రామాల్లో లెక్కే లేదని అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదు వస్తేనే తనిఖీ చేస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా భూగర్భ జల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎల్ నినో నేపథ్యంలో రాబోయే వేసవి మరింత కఠినంగా ఉంటుందని, ఇప్పటి నుంచే ఇంకుడు గుంతలు, వాటర్ హార్వెస్టింగ్ పాటించకపోతే తాగునీటికి కటకట ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాల్టాను ఉల్లంఘించొద్దు
ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో నీటిని వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవు. తప్పని పరిస్థితుల్లో ఎన్‌వోసీ తీసుకొని మాత్రమే బోరు వేయాల్సి ఉంటుంది.
– అభిజ్ఞాన్ మాల్వియా, సబ్ కలెక్టర్, ఆర్మూర్
గతేడాదితో పోలిస్తే..
జిల్లాలో భూగర్భ జల మట్టం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గతేడాదితో పోలిస్తే జిల్లాలో నీటిమట్టం ఏకంగా 1.12 మీటర్ల లోతుకు వెళ్లిపోయిందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (సీజీడబ్ల్యూబీ) జూన్ 2026 నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో భూగర్భ జలాలు తగ్గగా.. అందులో నిజామాబాద్ ఒకటిగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో అధికారికంగా సుమారు 98,504 బోర్లు ఉండగా, అనధికారికంగా మరో 30 వేల వరకు ఉన్నట్లు అంచనా. వర్షాభావం కారణంగా నీటిమట్టం 9 నుంచి 11 మీటర్ల లోతుకు పడిపోయింది. గత రెండు నెలల్లోనే 4 మీటర్లకు పైగా తగ్గినట్లు జిల్లా భూగర్భజల శాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం తగ్గిందిలా
యథేచ్ఛగా బోరుబావుల
తవ్వకానికి చెక్
ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో
కఠిన ఆంక్షలు
నిబంధనలను ఉల్లంఘిస్తే
జరిమానాతోపాటు బోరుసీజ్


