ఫిలింనగర్‌లో కామారెడ్డి జిల్లావాసి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

ఫిలింనగర్‌లో కామారెడ్డి జిల్లావాసి అదృశ్యం

Nov 10 2026 1:55 AM | Updated on Nov 10 2026 1:55 AM

ఫిలింనగర్‌లో కామారెడ్డి జిల్లావాసి అదృశ్యం ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం గన్నీ బ్యాగులకు నిప్పు మున్సిపల్‌ సామగ్రికి..

ఫిలింనగర్‌: కామారెడ్డి జిల్లా కు చెందిన ఓ వ్యక్తి ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమయ్యాడు. పోలీ సులు తెలిపిన వివరాలు ఇ లా.. కామారెడ్డి జిల్లా తాడ్వా యి మండలం దేమె గ్రామానికి చెందిన మెట్టు బాలసాయిలు (42) వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో ఉపాధి కోసం గత నెల 29న నగరానికి వచ్చి శివ కార్తీకేయ హోమ్‌కేర్‌ సర్వీసెస్‌లో కేర్‌ టేకర్‌గా చేరాడు. న్యాయవిహార్‌లోని ఓ న్యాయమూర్తి నివాసంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 2న రోగిని వెంట తీసుకుని అపోలో ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు రోగిని కేర్‌టేకర్‌తోపాటు నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు బాల సైలూ కనిపించడం లేదని కుటుంబసభ్యులకు సమాచారం అందింది. పలుచోట్ల వెతికినా కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వేల్పూర్‌(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రంలోని నాగులకుంట సమీపంలో శనివారం అర్ధరాత్రి రెండు ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, అందులోని రాగి తీగెలను చోరీ చేశారు. మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశారు. నాగులకుంట సమీపంలోని పంట భూముల రైతులు ఆదివారం ఉదయం అటుగా వెళ్లగా చోరీని గుర్తించి, పోలీసులకు, ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురికాకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ట్రాన్స్‌కో ఏఈ కిషన్‌ సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసంతో బోరుబావులకు కరెంటు సౌకర్యం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎల్లారెడ్డిరూరల్‌: మండలంలోని తిమ్మారెడ్డిలో గుర్తుతెలియని వ్యక్తులు గన్నీ బ్యాగులకు నిప్పు పెట్టడంతో సంచులు కాలిపోయినట్లు కార్యదర్శి రాంచందర్‌ సోమవారం తెలిపారు. వెల్లుట్ల సొసైటీ పరిధిలోని తిమ్మారెడ్డి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉంచిన గన్నీ బ్యాగులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కొన్ని సంచులు కాలిపోయినట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలో మున్సిపాలిటి సామగ్రికి ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు 5వ టౌన్‌ ఎస్సై సునీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని ఖిల్లా ప్రవేశమార్గం వద్ద కుడివైపు ఉన్న గదిలో మున్సిపాలిటీకి చెందిన కుర్చీలు, తలుపులు, చెక్కలు, టెంట్‌సామగ్రి భద్రపరిచారు. గుర్తుతెలియని వ్యక్తులు వాటికి నిప్పు పెట్టడంతో కాలిపోయినట్లు ఎస్సై తెలిపారు. మున్సిపల్‌ జవాన్‌ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement