కామారెడ్డి రూరల్: జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 13 నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్లను ఎంపిక చేశారు. కామారెడ్డి మండలం గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఎస్జీఎఫ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 14ఏళ్ల లోపు బాలబాలికల హాకీ క్రీడ పో టీలను నిర్వహించారు. ఈ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలికలు 22 మంది, బాలురు 21 మంది కలిపి మొత్తం 43 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. బాలికల విభాగంలో..శరణ్య,రిషిక,సోనాక్షి, సాక్షిత, ఈశ్వరి, లోహిత, హిమబిందు, మేఘన, వర్షిత, సంధ్య, జయశ్రీ, శ్రా వణి,భావన,రక్షిత, కావ్య,గంగోత్రి,రూప,సంధ్య, నందిని,దీపిక,ప్రవస్తి,వాహిని ఎంపికయ్యారు. బా లుర విభాగంలో.. కృష్ణ, రోషన్ గౌడ్, రోహిత్, తేజ, వరుణ్,సందేశ్,హర్షవర్ధన్,మనోజ్,మహర్షి,రణధీర్ ,మారుతి, దివాకర్, చంద్రకిరణ్, రిత్విక్, ఈశ్వర్, మౌనిష్, విజయ్, నేశ్వంత్, సుశాంత్, రామ్ చరణ్, విజయ్ ఎంపికయ్యారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీధర్, జిల్లా యువజన, క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్, పీడీ మధుసూదన్ రెడ్డి, స్వామి, నగేశ్, రాజు, ఆంజనేయులు, స్రవంతి, మానస తదితరులు ఎంపిక పోటీలను పర్యవేక్షించారు.


