తెయూ హాస్టల్స్‌ టెండర్ల ప్రక్రియ పూర్తి | - | Sakshi
Sakshi News home page

తెయూ హాస్టల్స్‌ టెండర్ల ప్రక్రియ పూర్తి

Nov 1 2026 7:31 AM | Updated on Nov 1 2026 7:31 AM

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ రెడ్డి, వార్డెన్స్‌, కన్వీనర్‌, మూడు హాస్టళ్ల మెస్‌ కమిటీల ప్రతినిధుల సమక్షంలో శనివారం టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. ప్రతి నాలుగు నెలలకొకసారి నిర్వహించే టెండర్ల ప్రక్రియలో భాగంగా చికెన్‌, గ్రోసరీ, కూరగాయలు, పెరుగు, పాలు తదితర సరుకుల సరఫరాకు సంబంధించి మొత్తం 13 కొటేషన్లను స్వీకరించారు. వీటిని పరిశీలించిన అనంతరం అత్యల్ప ధరలు (ఎల్‌–1) కోట్‌ చేసిన సరఫరాదారులకు టెండర్లను ఖరారు చేశారు. ఎంపికై న సరఫరాదారులు రాబోయే నాలుగు నెలలపాటు నిర్ణయించిన ధరలకే నాణ్యమైన సరుకులను నిరంతరాయంగా సరఫరా చేయాలని హాస్టల్‌ పర్చేస్‌ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కార్యక్రమంలో వార్డెన్లు గంగాకిషన్‌, కిరణ్‌ రాథోడ్‌, జ్యోత్స్న, కన్వీనర్‌ జ్యోతి, సిబ్బంది బికోజి, బబ్లు, పీరు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement