న్యూస్‌రీల్
ఆర్టీసీ ఉద్యోగ భద్రతకు..
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల భద్రత సాఽధించే దిశలో పోరాడుతామని జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈ వెంకన్న అన్నారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది.
శనివారం శ్రీ 3 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
– 8లో u
వానాకాలం సీజన్ పంటలు గట్టెక్కాయి. ఎల్ నినో ప్రభావం ఉన్నా.. అప్పుడప్పుడు కురిసిన వర్షాలు, భూగర్భ జలాలతో పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి కోతలు సైతం మొదలయ్యాయి. దీంతో ఇక వచ్చే యాసంగి సీజన్‌పైనే రైతులకు రంది పట్టుకుంది. బోరు బావులపై ఆధారపడి పంటలు పండించే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు జలాశయాల్లోనూ నీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉన్న నీటిని సాగు కోసం కాకుండా తాగునీటిగా ఉపయోగించుకోనున్న నేపథ్యంలో సాగు ప్రశ్నార్థకంగా మారింది.
నీరులేక వెలవెలబోతున్న శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నైరుతి రుతుపవన కాలం ముగిసింది. ఈసారి వానాకాలం ప్రారంభం నుంచి తగిన వర్షపాతం లేక పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. వానాకాలంలో జిల్లాలోని 23 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కురిసిన కొద్దిపాటి వర్షాలతోపాటు భూగర్భజలాలు, బోరుబావుల నీటితో రైతులు పంటలను కాపాడుకున్నారు. వరి పంట చేతికొచ్చే సమయానికి అలీసాగర్, నిజాంసాగర్, గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటి విడుదలతో చివరి దశలో ఉన్న పంటలు గట్టెక్కాయి. అయితే రానున్న యాసంగి సీజన్‌లో పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది.
వానలు కురిసింది తక్కువే..
జిల్లాలో వానాకాలం ప్రారంభం నుంచి ఎల్‌నినో ప్రభావంతో పలుచోట్ల కరవు కోరలను తలపించింది. సిరికొండ, ధర్పల్లి మండలాలు మినహా జిల్లాలో ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో వాన చినుకు పడలేదు. సిరికొండ మండలంలో 25.8 మి.మీ అధిక వర్షపాతం నమోదుకాగా, ధర్పల్లిలో 19.5 మి.మీ వర్షం పడింది. ఎడపల్లి, మోస్రా, ఇందల్వాయి, నవీపేట్ మండలాల్లో గతంతో పోల్చితే సాధారణ వర్షపాతం నమోదుకాగా, మిగితా 23 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సాలూర మండలంలో 36.2 మి.మీ మేరకు లోటు ఉండగా, ఆలూరులో 31 మి.మీ, ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల్లో 25.5 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది.
సగానికే పరిమితమైన ఎస్సారెస్పీ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఈసారి నీరులేక వెలవెలబోయి కనిపిస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 80.5 టీఎంసీలకు గానూ ఇప్పటి వరకు కేవలం 46.057 టీఎంసీలకే పరిమితమైంది. గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టులో 1086.30 అడుగుల ఎత్తులో 64.036 టీఎంసీల నీరు ఉంది. ఈసారి వర్షాలు లేక, ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి లేకపోవడంతో ప్రాజెక్టు నిండలేదు. జలాశయంలో నీటినిల్వ లేకపోవడంతో అలీసాగర్ ఎత్తిపోతలకు రోజుకు కేవలం 360 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్‌కు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భవిష్యత్తులో సాగునీటికి కాకుండా తాగునీటి అవసరాలకే ఈ నీటిని వినియోగించనుండటంతో యాసంగి పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి యాసంగి సీజన్‌లో పంటల సాగువిస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
జిల్లాలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం వివరాలు: (మి.మీ)
46 టీఎంసీలకే పరిమితమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
అలీసాగర్, నిజాంసాగర్, గుత్ప
ఎత్తిపోతలతో ఈసారికి గట్టెక్కిన
పంటలు
జిల్లాలో ఇప్పటి వరకు
23 మండలాల్లో లోటు వర్షపాతం
మరింత తీవ్రం కానున్న నీటి ఎద్దడి


