జిల్లాలో నమోదైన ప్రసవాల వివరాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో నమోదైన ప్రసవాల వివరాలు

Oct 3 2026 1:14 AM | Updated on Oct 3 2026 1:14 AM

నిజామాబాద్‌అర్బన్‌ : జిల్లాలోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్నాయి. అనవసరపు సిజేరియన్‌లు చేస్తూ డబ్బులు దండుకుంటున్నాయి. సాధారణంగా సుఖ ప్రసవానికి వీలు లేనప్పుడు, కడుపులో బిడ్డ సరిగా లేనప్పుడే సిజేరియన్లు చేయాలి. అయితే, సహజ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ ఉమ్మనీరు తక్కువగా ఉందని, బిడ్డ అడ్డం తిరిగిందని, గుండె వేగంగా కొట్టుకుంటోందని, పురిటి నొప్పుల బాధ భరించలేరని చెబుతూ కుటుంబీకులను భయపెట్టి అవసరం లేకపోయినా సిజేరియన్లు చేస్తున్నారు. సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్‌ చేసేందుకు సమయం చాలా తక్కువ పడుతుంది. మరోవైపు సిజేరియన్‌తో ఆస్పత్రికి ఆదాయమూ సమకూరుతోంది. దీంతో ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లే ఎక్కువ మంది మహిళలకు సిజేరియన్‌లు చేస్తున్నట్లు గణాంకాలే చెబుతున్నాయి.

నార్మల్‌కు 20 శాతం..

సిజేరియన్‌కు 40 శాతం

గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులను ప్రసవాల కోసం ప్రయివేటు ఆస్పత్రులకు వచ్చేలా నిర్వాహకులు కొందరు ఆర్‌ఎంపీలకు కమీషన్లు ముట్టజెబుతున్నారు. సాధారణ ప్రసవానికి 20 శాతం, సిజేరియన్లకు 40 శాతం చొప్పున కమీషన్లను అందజేస్తున్నట్లు తెలిసింది. ఒక్కో పేషెంట్‌ నుంచి సాధారణ ప్రసవానికి రూ.25వేల నుంచి రూ.45 వేలు, సిజేరియన్‌కు రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పరిస్థితి తీవ్రంగా ఉంటే రూ.లక్షకు పైబడి వసూలు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్‌ సమీపంలోని ఓప్రయివేటు ఆస్పత్రి ఆర్‌ఎంపీలకు ఎక్కువ మొత్తంలో కమీషన్లు అందజేస్తూ సిజేరియన్లు చేస్తున్నట్లు సమాచారం. బస్టాండ్‌ సమీపంలో ఉన్న మరో ప్రయివేటు ఆస్పత్రి నిర్వాహకులు ప్రతి నెలా ఆర్‌ఎంపీలకు విందులు, విహారయాత్రలు ఏర్పాటు చేస్తూ ప్రసవానికి సంబంధించిన కేసులను రాబడుతూ అధిక బిల్లులు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఖలీల్‌వాడీలో గతేడాది నూతనంగా వెలిసిన ఓ ప్రయివేటు ఆస్పత్రి గ్రామంలోని గర్భిణుల వివరాలను తెలుసుకొని సంబంధిత ఆర్‌ఎంపీలు, ఇతర సిబ్బందితో సంప్రదింపులు జరిపి తమ ఆస్పత్రికి వచ్చేలా కమీషన్లను అందజేస్తున్నట్లు సమాచారం.

ఆడిట్‌లో పరిశీలించి చర్యలు తీసుకుంటా..

ప్రతి సంవత్సరం నిర్వహించే ఆడిట్‌లో సిజేరియన్‌లు ఎక్కువ ఉన్న ఆస్పత్రుల వివరాలను పరిశీలించి వివరణ తీసుకుంటాం. తనిఖీలు చేస్తాం. అకారణంగా సిజేరియన్లు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. వైద్యశాఖ ఎల్లప్పుడు పరిశీలన చేస్తూనే ఉంటుంది. – రాజశ్రీ, డీఎంహెచ్‌వో

ఈ చిత్రాన్ని కాస్త దూరం నుంచి చూడగానే ఆటో, బైక్‌ ఢీకొన్నట్లు కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే అసలు విషయం తెలుస్తుంది. జక్రాన్‌పల్లి మండలంలోని 44వ నంబరు జాతీయ రహదారి మూలమలుపు వద్ద రాంగ్‌ రూట్‌లో ప్రయాణించొద్దని ప్రమాద తీవ్రత కళ్లకు కట్టేలా ఇలా ఏర్పాటు చేశారు. దీంతో రాంగ్‌ రూట్‌ ప్రయాణాలు తగ్గాయని పోలీసులు తెలిపారు. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నిజామాబాద్‌

ప్రయివేటు ఆస్పత్రులు

ప్రభుత్వ ఆస్పత్రులు

ఆర్థిక సంవత్సరం సాధారణ ప్రసవాలు సిజేరియన్‌లు మొత్తం

2025-26(ఏప్రిల్‌ వరకు) 4463 5403 9866

2026-27(ఆగస్టు వరకు) 1661 2040 3794

సాధారణ ప్రసవాలు సిజేరియన్‌లు మొత్తం

1445 11,371 12,816

590 4650 5240

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు

దారితప్పకుండా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement