మోపాల్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ పురుషులు, మహిళల జిల్లాస్థాయి ఎంపిక లు, టోర్నమెంట్‌ను ఈ నెల 4న నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంజీవ్‌రెడ్డి, గంగారాజు, కోచ్ రవీందర్ శుక్రవా రం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు మోపాల్‌లోని ఎన్‌ఆర్ ఆర్చరీ అకాడమీలో ఉదయం 8 గంటలకు రిపోర్టింగ్ చేయాలని సూచించారు. ఇండియన్ రౌండ్, రికర్వ్, కంపౌండ్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 11న హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ చాంపియన్‌షిప్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అర్హత పొందుతారని తెలిపారు.
షీ టీమ్‌లో 154 కేసులు
నిజామాబాద్ అర్బన్: ఆపద సమయంలో అతివలకు అండగా షీ టీం అందుబాటులో ఉందని సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు షీ టీం ప్రత్యేకంగా పనిచేస్తుందని పేర్కొన్నా రు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వేధింపులకు పాల్పడిన వారిపై 154 కేసులతోపాటు ఈ పెట్టి కేసులు 161 నమో దు చేసినట్లు తెలిపారు. షీ టీం ఆధ్వర్యంలో 416 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 1027 హాట్ స్పాట్‌లలో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆకతాయిలకు 61 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. షీ టీం బృందాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని, ఏదైనా ఇబ్బందులు ఉంటే 8712659 795 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.
జాతీయస్థాయి బాల్
బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
నిజామాబాద్ అర్బన్: జాతీయస్థాయి 45వ సబ్ జూనియర్ బాల్‌బ్యాడ్మింటన్ క్రీడా పో టీలకు జిల్లాకు చెంది న క్రీడాకారిణి గుగులోతు స్వప్న ఎంపికయ్యారు. రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వర కు హైదరాబాద్‌లోని ఏఎస్ రావునగర్ మా రుతి బాల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్‌లో ఎంపికలు జరిగాయి. ప్రతిభ కనబరిచిన స్వప్న ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాయిలో జరిగే నేషనల్ బ్యా డ్మింటన్ క్రీడాపోటీలలో పాల్గొనున్నారు.
కోతకు వచ్చిన సోయా
మద్నూర్: మండలంలో సాగు చేసిన సో యా పంట కోతకు వచ్చింది. కొందరు రైతులు యంత్రాలతో పంట కోస్తుండగా.. మరికొందరు రైతు కూలీలతో కోయించి కుప్ప వేసిన అనంతరం యంత్రాలతో కల్లం చేయిస్తున్నారు. అనంతరం మద్నూర్ మార్కెట్ యార్డుకు తరలించి ఎండబెడుతున్నారు. ఈసారి వర్షాభావ పరిస్థితులతో దిగుబడిపై ప్రభావం కనిపిస్తోందని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఐదు క్వింటాళ్లు కూడా రాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


