నిజామాబాద్ అర్బన్: గాంధేయ మార్గం అనుసరణీయమని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నగరంలోని గాంధీచౌక్‌లో గల మహాత్ముని విగ్రహానికి మేయర్‌తోపాటు అదనపు కలెక్టర్ భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పూలమాల లు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్ర ధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఇరువురు జాతి నేతలు దేశానికి అందించిన సేవలను కొనియాడారు. మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ దేశాభ్యున్నతికి, సమాజ హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు.


