ప్రభుత్వ సలహాదారుకు ఆహ్వానపత్రిక అందజేత | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సలహాదారుకు ఆహ్వానపత్రిక అందజేత

Sep 25 2026 2:17 AM | Updated on Sep 25 2026 2:17 AM

ప్రభుత్వ సలహాదారుకు ఆహ్వానపత్రిక అందజేత నేడు జిల్లాకు టీపీసీసీ చీఫ్‌ రాక నేడు సామూహిక పూర్తి వందేమాతరం గేయాలాపన

బాన్సువాడ రూరల్‌: బాన్సువాడలో ఈనెల 27న నిర్వహించే జాతీయ సమైక్యతా సదస్సుకు హాజరు కావాలని కోరుతూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి నిర్వాహకులు ముఫ్తీ ఉమర్‌ బిన్‌ ఈసా ఆహ్వాన పత్రికను గురువారం అందించారు. జాతీయ సమైక్యత, పరస్పర సోదరభావం, మతసామరస్యంతో పాటు శాంతిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈకార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మౌలాన రఫీఖ్‌, నాయకులు వాహబ్‌, అఫ్రోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ రూరల్‌: రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ శుక్రవారం జిల్లాకు రానున్నారు. జిల్లాకేంద్రంలో నేడు గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో శోభయాత్రను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం పార్టీ సమావేశాల్లో పాల్గొనున్నారు.

కామారెడ్డి అర్బన్‌: శ్రీసరస్వతి విద్యామందిర్‌, విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నమామి భారతం వందేమాతరం పూర్తి గేయాలాపన చేయనున్నట్లు ప్రతినిధులు శ్యాంసుందర్‌, హరిస్మరణ్‌రెడ్డి, రాజారెడ్డి, మల్లేష్‌యాదవ్‌, గంగారెడ్డి, ఎం.ఆనంద్‌, ప్రతాప్‌గౌడ్‌ తెలిపారు. పట్టణంలోని శ్రీసరస్వతి విద్యామందిర్‌ హైస్కూల్‌, జీవదాన్‌ సర్ధార్‌ పటేల్‌ విగ్రహం, నిజాంసాగర్‌ చౌరస్తా, కొత్తబస్టాండ్‌, శివాజీ విగ్రహం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జయప్రకాశ్‌ నారాయణ విగ్రహం, భగత్‌సింగ్‌ నగర్‌ సరస్వతి శిశుమందిర్‌ వద్ద వందేమాతం పూర్తి గేయాలాపన ఉంటుందని అన్నారు.

విద్యార్థులకు అండగా ఎన్‌ఎస్‌యూఐ

తెయూ(డిచ్‌పల్లి): విద్యారంగ సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులకు అండగా ఉంటుందని యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బట్టు వేణురాజు, రాష్ట్ర కార్యదర్శి సుద్దుల గంగాప్రసాద్‌ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీని గురువారం వారు సందర్శించారు. ఈసందర్భంగా తెయూలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని, మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు యూనివర్సిటీ ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. వర్సిటీ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులను సన్మానించారు. వర్సిటీ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు అరుణ్‌తేజ్‌, జనరల్‌ సెక్రెటరీ జటావత్‌ రాజు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ కార్తిక్‌ సిసోడియా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement