ఆ ఏపీఎం మాకొద్దు సారూ.. | - | Sakshi
Sakshi News home page

ఆ ఏపీఎం మాకొద్దు సారూ..

Aug 29 2026 1:52 AM | Updated on Aug 29 2026 1:52 AM

నకిలీ బిల్లులతో డబ్బులు

తీసుకుంటున్నాడని ఆవేదన

డీఆర్‌డీవోకు ఫిర్యాదు చేసిన

మహిళా సమాఖ్య సభ్యులు

బీబీపేట:మహిళా సంఘాల డబ్బులను సొంతానికి వాడుకోవడంతోపాటు నకిలీ బిల్లులతో నిధులు దు ర్వినియోగం చేస్తున్న ఏపీఎంపై మహిళా సమాఖ్య సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కార్యాలయ ఫర్నిచర్‌ కొనుగోలు విషయంలో నకిలీ బిల్లు లు పెట్టి డబ్బులు సొంతానికి వాడుకున్నాడని, వెంటనే అతనిని విధుల నుంచి తొలగించాలని బీబీపే ట మహిళా సమాఖ్య సభ్యులు జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్థ అధికారి(డీఆర్డీవో)కి ఫిర్యాదు చేశారు.

పాత సీపీయూకు రూ. 35 వేల బిల్లు

మండల కార్యాలయంలో సీపీయూ అవసరం ఉండగా కామారెడ్డిలోని ఓ దుకాణంలో పాత సీపీయూ కొనుగోలు చేసి రూ. 35 వేల బిల్లును పెట్టి డబ్బు లు తీసుకున్నాడని పేర్కొన్నారు. ఫర్నిచర్‌ కొనుగో లు విషయంలో కూడా ఎక్కువగా బిల్లులు చూపించి బలవంతంగా సంతకాలు పెట్టించుకొని డబ్బు లు తీసుకున్నట్లుగా వివరించారు. జిల్లా స్థాయి అధికారులు మీటింగ్‌కు వచ్చినప్పుడల్లా వారి కారులో డీజిల్‌ పోయించాలని చెప్పి డబ్బులు తీసుకుంటు న్నాడని పేర్కొన్నారు. మరోవైపు మండల కార్యాలయంలో పనిచేసే కొందరు సిబ్బందిని డిప్యూటేషన్ల ద్వారా మరో చోటికి పంపించి, అతనికి అనుకూలంగా ఉండే వారిని ఇతర మండలాల నుంచి బది లీ చేయించుకొని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని తెలిపారు. మండల సమాఖ్య సభ్యులు తిరస్కరించినా జిల్లా సమాఖ్య నుంచి ఆపరేటర్‌ను తీసుకొచ్చి నియమించారని, కార్యాలయంలో ఒక అకౌంటెంట్‌ సరిపోగా, మరొకరిని తీసుకున్నట్లు వివరించారు. మండల సమాఖ్య నెలవారీ సమావేశాల్లో మహిళలపై ఇష్టారీతిన, దురుసుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. జిల్లా అధికారులు స్పందించి ఏపీఎంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement