గాంధారి : ద్విచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, హెల్మెట్ ధరించని వారికి అవగాహన కల్పించాలని సదాశివనగర్ సీఐ వీరయ్య సూచించారు. శుక్రవారం ఆయన గాంధారి పోలీస్టేషన్ సందర్శించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసులు లేకుండా ఎప్పటికప్పుడు విచారణ చేయాలన్నారు. నంబరు ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఏఎస్సైలు రవికుమార్, ప్రకాశ్ సిబ్బంది ఉన్నారు.
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామశివారు లో అడవి పందు ల దాడిలో శుక్ర వారం వేకువజామున మక్క పంట ధ్వంసమైంది. కౌలు రైతు అంద్యాల రమేశ్ సాగు చేస్తున్న మూడు ఎకరాల మక్క పంటను అడవి పందులు ధ్వంసం చేశాయి.


