జిల్లాలో కొత్త వాహనాల కొనుగోళ్ల జోరు
నిజామాబాద్‌అర్బన్: కొత్త వాహనాలు జిల్లాలోని రోడ్లపైకి రయ్‌మని దూసుకొస్తున్నాయి. రోజురోజుకూ వాహనాల రిజిస్ట్రేషన్‌ల సంఖ్య పెరుగుతోంది. వివిధ వాహనాల కంపెనీలు మార్కెట్‌లోకి కొత్త కొత్త మోడల్‌లను విడుదల చేస్తున్నాయి. 2025 ఏప్రిల్ నుంచి 2026 జూలై వరకు జిల్లా వ్యాప్తంగా 22 వేలకుపైగా వివిధ రకాల వాహనాలు రిజి స్ట్రేషన్ అయ్యాయి. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ రవాణా శాఖ కార్యాలయాల పరిధిలో వాహనాల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రతినెలా స గటున 1600 నుంచి 1700 వరకు వాహనాలు రిజి స్ట్రేషన్‌లు అవుతున్నాయి. పెరుగుతున్న జనాభా, రోజురోజుకు పెరుగుతున్న అవసరాలు వాహనాల కొనుగోళ్లకు కారణమవుతున్నాయి. ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వాహనాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అటు రవాణాశాఖకు రిజిస్ట్రేషన్‌లతోపాటు లైఫ్, గ్రీన్ పన్నుతో ఆదాయమూ పెరుగుతోంది. 2023 – 24 సంవత్సరంలో రూ.139 కోట్లు, 2024 – 25లో రూ.145 కోట్లు, 2025 – 26లో రూ.101 కోట్ల ఆదాయం సమకూరింది.
కొనుగోళ్లు ఇలా..
జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 జూలై వరకు ద్విచక్ర వాహనాలు 12780, కార్లు 2783, మోటార్ క్యాబ్‌లు 210, గూడ్స్ వాహనాలు 740, ట్రాక్టర్లు 1220, కమర్షియల్ ట్రాక్టర్లు 277, మినీ బస్సులు 154, ఆటో రిక్షాలు 1380, త్రి చక్ర రవాహనాలు 320 రిజిస్ట్రేషన్ అయ్యాయి.
ఇన్సూరెన్స్ విధానం సాధ్యపడేనా?
వాహనలకు ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్, డీజిల్ విక్రయించాలనే నూతన విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఈ విధానం అమలు కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ అనే విధానాన్ని గతంలో తీసుకువచ్చినా అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ తప్పనిసరి అనే నిబంధన తీసుకువస్తే ఏ మేరకు సాధ్యమవుందనే చర్చ సాగుతోంది.
జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజురోజు కూ పెరుగుతోంది. వివిధ కంపెనీలు తక్కువ బడ్జెట్‌లో వాహనాలను మార్కెట్లోకి తీసుకురావడం, వాహనాలు తేలికగా ఉండడంతోపాటు పెట్రోల్, డీజిల్ ఇబ్బందులు లేకపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నా యి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. 2021 నుంచి ఈవీ వాహనాల విక్రయాలు ప్రారంభం కాగా, కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూలై వరకు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలలో ఆటో లు 120, ద్విచక్ర వాహనాలు 1283, కార్లు 148, త్రి చక్ర వాహనాలు (గూడ్స్) 34 రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు టాక్స్‌ను రిజిస్ట్రేషన్ ఫీజులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ప్రభు త్వ ప్రోత్సాహంతో కొనుగోళ్లు జోరుగాసాగుతున్నాయి.
రోజు రోజుకు పెరుగుతున్న
రిజిస్ట్రేషన్‌ల సంఖ్య
ఎలక్ట్రిక్ వాహనాలకు
పెరుగుతున్న ఆదరణ
రవాణాశాఖకు భారీ
సమకూరుతున్న ఆదాయం


