అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు

Aug 29 2026 1:46 AM | Updated on Aug 29 2026 1:46 AM

నకిలీ నోట్లు స్వాధీనం

ఇతర రాష్ట్రాల్లో సంబంధాలపై

కొనసాగుతున్న విచారణ

బాన్సువాడ రూరల్‌: నకిలీ కరెన్సీ కొనుగోలు చేసి చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును బాన్సువాడ పోలీసులు రట్టు చేశారు. జిల్లా ఎస్పీ రాజేశ్‌చంద్ర ఆదేశాలతో చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించా రు. శుక్రవారం బాన్సువాడ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విఠల్‌రెడ్డి, రూరల్‌ సీఐ తిరుపయ్య కేసు వివరాలు వెల్లడించా రు. మహారాష్ట్రలోని పర్బని జిల్లాకు చెందిన రావుసాహెబ్‌ అనే యువకుడు తనకు పరిచయమైన ఓవ్యక్తి ద్వారా హైదరాబాద్‌లోని ముదస్సర్‌ హుస్సే న్‌ అలియాస్‌ షాబాబా వద్ద నకిలీ కరెన్సీ దొరుకు తుందని తెలుసుకున్నాడు. తన మిత్రులు ప్రతీక్‌, భీమ్‌ శంకర్‌ రామ్‌లతో కలిసి వెళ్లి షాబాబా వద్ద రూ.లక్ష అసలు కరెన్సీ ఇచ్చి రూ.2 లక్షల నకిలీ కరె న్సీ తీసుకున్నారు. ఈ నెల 26 న స్వస్థలానికి వెళ్తూ పిట్లం హైవే సమీపంలోని పెట్రోల్‌ బంకులో రూ.2 వేల పెట్రోల్‌ పోయించుకొని రూ.500 నకిలీ నోట్లు నాలుగు ఇచ్చారు. అవి నకిలీ నోట్లుగా బంక్‌ క్యాషియర్‌ గుర్తించి కారును ఆపే ప్రయత్నం చేయగా ఆ పకుండా వెళ్లిపోయా రు. దీంతో క్యాషియర్‌ శ్రీకాంత్‌రెడ్డి ఈ నెల 27న పిట్లం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, మిగిలిన నకిలీ కరెన్సీ నోట్ల ను చెలామణి చేయడానికి ముగ్గురు నిందితులు కారులో హైదరాబాద్‌ బయలుదేరగా ధర్మారం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.500 విలువైన 182 నకిలీ నోట్లు, మొత్తం రూ.91 వేలు, మూడు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ సరఫరా చేసిన ఇతర వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ విఠల్‌రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని సంబంధాలపై కూడా విచారణ జరుగుతోందన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పిట్లం ఎ స్సై ఆంజనేయులు, బాన్సువాడ రూరల్‌ సీఐ తిరు పయ్య, పోలీస్‌ సిబ్బంది శైలేశ్‌, రాము, వెంకటేశ్‌ల ను ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement