సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కడుతున్న
మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు రాఖీ
కడుతున్న చెల్లెలు భారతి
జిల్లా ప్రజలు రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. సోదరీమణులు శుభ గడియల్లో తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. అలాగే పద్మశాలీలు, క్షత్రీయులు యజ్ఞోపవీత ధారణను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పలు చోట్ల అన్నదానాలుచేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టారు. అలాగే పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఆయన సోదరి భారతి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా సాగాయి.
– నిజామాబాద్ రూరల్


