ఎస్‌ఎన్‌ఏ–స్పర్శతో పరేషాన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎన్‌ఏ–స్పర్శతో పరేషాన్‌

Aug 28 2026 1:27 AM | Updated on Aug 28 2026 1:27 AM

ఉపసంహరించుకోవాలి జిల్లాలో నోటీసుల జారీ ఇలా..

న్యూస్‌రీల్‌

విద్యార్థుల సంఖ్య ఆధారంగా గ్రాంట్‌ ఇలా..

నిజామాబాద్‌

స్కూళ్లకు మొదటి విడుత

స్కూల్‌ గ్రాంట్‌ విడుదల

నూతన డిజిటల్‌ విధానంపై

హెచ్‌ఎంల అసంతృప్తి

అమ్మా బైబై..

తండ్రి ద్విచక్రవాహనంపై స్కూల్‌కు వెళ్తుండ గా వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో బాన్సువాడలో చిన్నారి దుర్మరణం పాలైంది.

శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026

– 9లో u

జిల్లా ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌ అర్బన్‌ : సోదరసోదరీమణుల ప్రేమకు ప్రతీక అయిన రక్షాబంధన్‌ (రాఖీ పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని జి ల్లా ప్రజలకు ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా శుభాకాంక్షలు తెలిపారు. ‘రాఖీ’ కుటుంబ బంధాలను బ లోపేతం చేసే వారధి అని పేర్కొన్నారు. మ హిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యమ నే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుందని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రజల మధ్య ఆత్మీయతను మరింత పెంపొందించాలని వారు ఆకాంక్షించారు.

సీపీకి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు..

రక్షాబంధన్‌ వేడుకల్లో భాగంగా బ్రహ్మకుమారీలు పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్యకు గురువారం రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మకుమారీలు వనజ, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు..

నిజామాబాద్‌ రూరల్‌: రాఖీ పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు అవసరమైన చోట్ల అదనపు బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ రీజినల్‌ మేనేజజర్‌ కృష్ణమూర్తి అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూ టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు.

నీట్‌ పీజీ ఎంట్రెన్స్‌కు

బందోబస్తు

నిజామాబాద్‌ అర్బన్‌: ఈ నెల 30వ తేదీన నీట్‌ పీజీ ఎంట్రెన్స్‌ పరీక్ష నేపథ్యంలో పరీక్షకేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య గురువా రం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో ఉన్న ఏవీ ఎంటర్ర్‌పైజెస్‌, మల్లారంలోని ఆయేషా కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రెండు సెంటర్లలో పరీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగనుందని, ఆయా సెంటర్ల సమీపంలోని జిరాక్స్‌, ఇంటర్నెట్‌ సెంటర్లతోపాటు స్టేషనరీ దుకాణాలను ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసి ఉంచాలని సూచించారు. సెంటర్ల పరిసరాల్లో సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ (సెక్షన్‌ 144 సీఆర్‌పీసీ) అమలులో ఉంటుందని తెలిపారు.

‘అంకితభావంతో

పనిచేయాలి’

బాన్సువాడ రూరల్‌: ఐసీటీసీ, ఏఆర్‌టీ సెంటర్ల ఉద్యోగులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొ సైటీ బేసిక్‌ సర్వీస్‌ డివిజన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జయలక్ష్మి సూచించారు. గురువారం ఆమె బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసీటీసీ, ఏఆర్‌టీ సెంటర్లను తనిఖీ చేసి పలు సూచనలు ఇచ్చారు. ఆమె వెంట కా మారెడ్డి డీపీఎం చల్లా సుధాకర్‌ ఉన్నారు.

ఖలీల్‌వాడి : ప్రభుత్వ పాఠశాలలకు సమగ్ర శిక్ష అభియాన్‌ ద్వారా విడుదలయ్యే కాంపోజిట్‌ స్కూల్‌ గ్రాంట్లపై ప్రధోపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఎన్‌ఏ (సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ) – స్పర్శ డిజిటల్‌ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం కారణంగా హెడ్‌మాస్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే నిధులే తక్కువ, అందులో స్కూళ్లకు చేసే పనులకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పాఠశాలలకు అత్యవసర పనులకు ఖర్చు చేసే నిధులను ఈ విధానంలో చూపెట్టలేమని, ముందుగా ఖర్చు చేసే పనులకు సంబంధించి నిధుల హామీ వెండర్లు ఇవ్వడం కష్టసాధ్యమని అంటున్నారు.

స్పర్శ అమలు విధానం

సర్కారు బడులకు సమగ్రశిక్ష ద్వారా స్కూల్‌ గ్రాంట్లు, మెయింటెనెన్స్‌ గ్రాంట్‌ల బిల్లుల సమర్పణ, నిధుల వినియోగం, చెల్లింపుల ప్రక్రియను డిజిటల్‌ విధానం ద్వారా చేయాల్సి ఉంటుంది. పాఠశాలకు వచ్చిన గ్రాంట్‌లను స్కూల్‌కు కావాల్సిన చాక్‌పీస్‌లు, స్టేషనరీ, పరీక్షల నిర్వహణ, సామగ్రి, చిన్నపాటి మరమ్మతులు, విద్యుత్‌ బిల్లులతోపాటు పరిశుభ్రత నిర్వహణకు ఖర్చు చేస్తారు. ఈ నిధులు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించిన నిధులు స్కూల్‌ కాంప్లెక్స్‌ డీడీవో ఖాతాల ద్వారా జమ చేస్తారు. అయితే గతంలో కాకుండా ఖర్చుచేయడానికి జీఎస్టీ బిల్లు పెట్టినప్పుడే లబ్ధిదారునికి లేదా వెండర్‌కు నిధులు బదిలీ అవుతాయి. దీంతో పాఠశాల ఖాతాలో డబ్బు జమ కావు. దానికి బదులుగా ఐఎఫ్‌ఎంఐఎస్‌ పద్ధతి ద్వారా పాఠశాల విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొంత డ్రాయింగ్‌ అమౌంట్‌ కేటాయించబడుతుంది. స్కూల్‌ నిర్వహణకు అవసరమైన నిధులను ఎస్‌ఎంసీ తీర్మానం మేరకు వెండర్‌ ఖాతాలో జమ చేసే ముందు ఆ వివరాలను స్పర్శ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే వెండర్‌ నుంచి జీఎస్టీ బిల్‌ తీసుకొని సంబంధిత కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్‌కు సమర్పిస్తే మార్కర్‌ ఐడీ ద్వారా బిల్లు క్రియేట్‌ చేసి చెక్కర్‌ ఐడీ ద్వారా వెండర్‌ ఖాతాలోకి జమ చేస్తారు. హెడ్‌మాస్టర్‌ క్యాష్‌బుక్‌, ఓచర్లు సమకూర్చడం వాటి పత్రాల నిర్వహణ చేయాలి. వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించడం కుదరదు. అన్ని బిల్లలులను అధికారిక పోర్టర్ల ద్వారా వెండర్‌ ద్వారా డిజిటల్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

ప్రాథమిక, ప్రాథమికోన్నత

హెడ్‌మాస్టర్లు ఇబ్బందులు

ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు వచ్చే స్కూల్‌ గ్రాంట్లు చాలా తక్కువగా ఉంటాయి. వీటికి విద్యార్థుల సంఖ్య ఆధారంగా సుమారు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వస్తుంది. ఈ గ్రాంటు ఆగస్టు నెలలో మొదటి విడత వచ్చింది. జూన్‌ నుంచి ఆగస్ట్‌ వరకు పాఠశాలల నిర్వహణకు ఖర్చు చేసిన చిన్న, చిన్న ఖర్చులను ప్రధానోపాధ్యాయులు సొంత నిధులతో ఖర్చు చేశారు. కానీ వచ్చిన గ్రాంటు నుంచి హెచ్‌ఎంలు ఖర్చు చేసిన డబ్బులు తీసుకునే వెసలుబాటు లేదు. ఖర్చు చేసిన నిధులకు జీఎస్టీ బిల్లులు మార్కెట్‌లో వ్యాపారులు ఇవ్వడం లేదు. స్కూల్‌కు చేసే ఖర్చు చేసే ప్రతి పనికి కాంప్లెక్స్‌ ప్రధానాపాధ్యాయుడిని సంప్రదించాలి. అలాగే వెండర్‌ను వెతకాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో హెడ్‌మాస్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

స్కూల్‌ గ్రాంట్‌ వినియోగంలో నూతన స్పర్శ విధానాన్ని అమలు చేయడం తగదు. స్కూళ్లకు రోజువారి అవసరాలు, అత్యవసర మరమ్మతులు, పాఠశాల నిర్వహణకు సంబంధించిన చిన్న చిన్న ఖర్చులను సకాలంలో చెల్లించడంలో ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. పాత విధానాన్ని అమలు చేయాలి.

– అంకం నరేశ్‌, పీఆర్టీయూ ఆసోసియేట్‌

అధ్యక్షుడు, నిజామాబాద్‌

సుభాష్‌నగర్‌ : అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సూచించారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌లో భాగంగా 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్‌ జరగని వారికి, వివిధ కారణాలతో తాజా జాబితాలో పేర్లు రాని ఓటర్లకు హియరింగ్‌కు రావాలని కోరుతూ బీఎల్‌వోలు ఇంటింటికి తిరుగుతూ నోటీసులు జారీ చేస్తున్న ప్రక్రియను కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని 19వ డివిజన్‌ పరిధిలో ఉన్న కంఠేశ్వర్‌లో సిబ్బంది ఇంటింటికి తిరిగి నోటీసులు అందిస్తున్న విధానాన్ని ఆయన నిశితంగా పరిశీలించారు. ఎంతో ప్రాధాన్యతతో కూడిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ధ్రువీకరణ అవసరమున్న ఓటర్ల ఇంటింటికి స్వయంగా వెళ్లి నోటీసులు అందించాలని, సూచించిన సమయానికి ఒకవేళ వారు రాలేకపోతే మరోమారు నోటీసు ఇవ్వాలని సూచించారు. నోటీసు అందించే సమయంలోనే ఎవరైనా ఓటర్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే వాటిని స్వీకరించాలని బీఎల్‌వోలకు కలెక్టర్‌ సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, బీఎల్‌వో సూపరింటెండెంట్‌ మురళి, బీఎల్‌వో లావణ్య తదితరులు ఉన్నారు.

నిజామాబాద్‌ నగరంలో నోటీసులు అందజేసే ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

నిజామాబాద్‌ అర్బన్‌ : స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌లో భాగంగా ఓటరు ముసాయిదా జాబితాలో తప్పులను గుర్తించి సంబంధిత ఓటర్లకు అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 4,32,405 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా.. 4,32,401 మందికి అందజేశారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో 63,170, బోధన్‌ నియోజక వర్గంలో 61,262 మందికి, బాన్సువాడ నియోజక వర్గంలో 52,919 మందికి, నిజామాబాద్‌ అర్బన్‌లో 1,09,639 మందికి, రూరల్‌లో 80,026 మందికి. బాల్కొండ నియోజకవర్గంలో 65,380 మందికి నోటీసులు జారీ చేశారు.

సాంఘిక బహిష్కరణ ఘటనలపై

కఠినంగా వ్యవహరించాలి

ప్రతి నెలా సివిల్‌ రైట్స్‌ డేను పక్కాగా

నిర్వహించాలి

విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

అట్రాసిటీ కేసుల పురోగతిపై సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement