నిజామాబాద్ అర్బన్ : ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఉ ద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్‌కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధ ర్నా చౌక్‌లో ఉద్యోగులు గురువారం మహాధ ర్నా నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన ఉ ద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. రెండో పే రి విజన్ కమిటీ నివేదిక అమలు చేయాలని, ఆరు పెండింగ్ డీఏలు విడుదల చేయాలన్నారు. సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను ప్రవేశపెట్టాలన్నా రు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి ఉద్యోగులు, పెన్షనర్లతోపా టు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలందించాలని కోరారు. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెండో పే రివిజన్ కమిటీ నివేదికను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండచేశారు. ఉద్యోగులకు తగిన వేతన సవరణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, గత పీఆర్‌సీ గడువు ముగిసిన మూడేళ్లవుతున్నందున రెండో పీఆర్‌సీ నివేదికను తక్షణమే అమలు చేయడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలన్నారు.
తరలివచ్చిన ఉద్యోగులు
ఎన్టీఆర్ చౌరస్తాలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్య లో తరలివచ్చారు. జిల్లా పరిషత్ ఉద్యోగు లు ర్యాలీగా రాగా, ఆయా ఉపాధ్యాయ సంఘాల వారు ప్ల కార్డ్స్ ప్రదర్శిస్తూ నిరస న తెలుపుతూ వచ్చారు. ఒక్కో శాఖకు చెందిన ఉద్యోగులు ఒక్కో విధంగా నిరసన తె లిపారు. టీఎన్జీవోస్ నాయకుడు శేఖర్, రెవె న్యూ అసోసియేషన్ కార్యదర్శి పి శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, కార్యదర్శి కిషన్, మాజీ కార్యదర్శి వెంకటేశ్వర్‌గౌడ్, యూటీఎఫ్ రా ష్ట్ర కార్యదర్శి సత్యానంద్, విజయలక్ష్మి, ర వీందర్‌సాగర్, సౌమ్య వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
సీపీఎస్‌ను రద్దు చేసి ప్రభుత్వం
ఓపీఎస్ తీసుకురావాలి
ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
వేతన సవరణ ప్రభుత్వ బాధ్యత
ఉద్యోగుల జేఏసీ చైర్మన్ నాశెట్టి సుమన్
ధర్నా చౌక్‌లో ఉద్యోగుల నిరసన


