తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న పీజీ 2, ఐఎంబీఏ 8వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు గురువారం ముగిసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. చివరి రోజు పరీక్షలకు 605 మంది విద్యార్థులకు గానూ 555 మంది హాజరుకాగా 50 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.
● 13 మందికి తీవ్రగాయాలు
కమ్మర్‌పల్లి(మోర్తాడ్): మోర్తాడ్ మండల కేంద్రంలో గురువారం పిచ్చికుక్క స్వైరవిహారం చేయడంతో పలువురు గాయాల బారిన పడ్డారు. వీధుల్లో తిరుగుతూ కనిపించిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. 13 మందిని కరిచి తీవ్ర గాయాలపాలు చేసింది. ఎనిమిదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగతా క్షతగాత్రులను స్థానిక సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. మోర్తాడ్‌లో కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
● అంత్యక్రియలకు హాజరైన జడ్జీలు, న్యాయవాదులు
నిజామాబాద్ లీగల్ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అలిశెట్టి లక్ష్మీనారాయణ తండ్రి గంగాధర్ అనారోగ్య కారణాలతో బుధవారం రాత్రి మరణించారు. ఆయన భౌతికకాయానికి గురువారం నిజామాబాద్ నగరంలో అంత్యక్రియలు నిర్వహించారు. మెండోరా మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు గంగాధర్ నగరంలోని బైపాస్ రోడ్ సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. మరణవార్త తెలుసుకున్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ రామకృష్ణారెడ్డి, జస్టిస్ గౌస్ మీర్ మోహినొద్దీన్‌లు.. గంగాధర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. జస్టిస్ లక్ష్మీనారాయణను ఓదార్చారు. అంత్యక్రియల్లో జిల్లా ఇన్‌చార్జి జడ్జి హరీష, జూనియర్ సివిల్ జడ్జి హరికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు, సీనియర్ న్యాయవాదులు టక్కర్ హన్మంత్ రెడ్డి, కుమార్ దాస్, బండారి కృష్ణానంద్, మల్లెపూల జగన్మోహన్ గౌడ్, పడిగెల వెంకటేశ్వర్లు, అదనపు పబ్లి క్ ప్రాసిక్యూటర్ నరసింహా రెడ్డి, ఆర్మూర్ బార్ అసోసియేషన్ సభ్యులు లోక్ భూపతి రెడ్డి, మురళి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


