ఎవరికి వారే.. | - | Sakshi
Sakshi News home page

ఎవరికి వారే..

Jul 24 2026 1:33 AM | Updated on Jul 24 2026 1:33 AM

న్యూస్‌రీల్‌

నామినేటెడ్‌ పదవుల కేటాయింపు పెండింగ్‌

నిజామాబాద్‌

పోక్సో ఫిర్యాదు..

చిన్నారులపై లైంగిక వేధింపులు లేదా దాడులు జరిగితే ఇకపై నేరుగా ఫోన్‌ నుంచే ఫిర్యాదు చేయొచ్చు.

శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026

– 8లో u

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై అధికార కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టిపెట్టింది. అర్హులు తమ ఓట్లు కోల్పోవడం ద్వారా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని, ఇటీవల దేశంలోని ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన సర్‌ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓట్లు కోల్పోవడంతో కాంగ్రెస్‌కు నష్టం జరిగిందని పార్టీ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సర్‌ ప్రక్రియ తీరును సీరియస్‌గా తీసుకుంది. అర్హులందరికీ ఓటుహక్కు ఉండేలా క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లకు ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించింది. వారంతా నియోజకవర్గాల్లోనే ఉంటూ ఓటరు జాబితా సవరణపై దృష్టిపెట్టాలని పార్టీ అధిష్టానం ముఖ్యనేతలను ఆదేశించింది. అయితే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల పనితీరుపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ‘సర్‌’ ప్రక్రియకు సంబంధించి ప్రధానంగా ఆర్మూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ జాడ కనిపించడం లేదని వ్యాఖ్యానించడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలో ముఖ్య నేతల మధ్య సమన్వయలోపం, వర్గపోరు నేపథ్యంలోనే పనులు ముందుకు సాగడం లేదని కేడర్‌ ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఆర్మూర్‌..

సర్‌ ప్రక్రియను బూత్‌ లెవల్‌ స్థాయిలో నిశితంగా పరిశీలిస్తూ అర్హుల ఓట్లను కాపాడేందుకు పకడ్బందీగా పనిచేయాలని పార్టీ నేతలను అధిష్టానం ఆదేశించింది. బీఎల్‌ఏ, బీఎల్‌వో స్థాయిలో పార్టీ శ్రేణుల ద్వారా సేకరించిన నివేదికను ఎప్పటికప్పుడు గాంధీభవన్‌కు అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నేతల పనితీరును మదింపు చేయగా.. జిల్లాలోని ఆర్మూర్‌ నియోజకవర్గం చివరి స్థానంలో ఉండటంపై చర్చ సాగుతోంది. అసలు ఈ నియోజకవర్గంలో పార్టీ జాడే లేకుండా ఉన్నట్టు సీఎం అభిప్రాయపడినట్టు తెలిసింది. నియోజకవర్గాల వారీగా పనితీరును ఏ,బీ,సీ,డీ కేటగిరీల్లో విభజించగా, కాంగ్రెస్‌ నేతల పనితీరులో ఆర్మూర్‌ నియోజకవర్గం ‘డీ’ కేటగిరీలో, బాల్కొండ, బోధన్‌ నియోజకవర్గాలు ‘సీ’ కేటగిరీలో, నిజామాబాద్‌ అర్బన్‌ ‘బీ’ కేటగిరీలో, నిజామాబాద్‌ రూరల్‌ మాత్రమే ‘ఏ’ కేటగిరీలో ఉన్నట్టు పార్టీకి నివేదిక అందింది.

రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన కార్పొరేషన్‌ చైర్మన్‌ల పదవీకాలం ముగిసింది. ఈనెల 8వ తేదీ చైర్మన్‌ల పదవీకాలం పూర్తయినప్పటికీ ఇప్పటివరకు రెన్యువల్‌ లేదా కొత్తవారికి అవకాశం ఇవ్వలేదు. అయితే పదవుల కోసం పార్టీ నేతలు, ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలను కొనసాగిస్తుండగా, పార్టీ అధిష్టానం మాత్రం పదవుల కేటాయింపును పెండింగ్‌లో ఉంచింది. ప్రస్తుతం పార్టీ నేతలంతా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపైనే పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరించాలని స్పష్టం చేసింది. సర్‌ తర్వాతే కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవుల కేటాయింపు ప్రక్రియ ముందుకుసాగనున్నట్లు తెలుస్తోంది.

పార్టీ ఆదేశాలు బేఖాతర్‌

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువును ఎన్నికల సంఘం ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇందుకోసం జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో విస్తృతంగా సమావేశాలతోపాటు క్షేత్రస్థాయి పరిశీలనను ముమ్మరం చేసింది. అయితే జిల్లాలో పరిస్థితి మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా తయారైంది. ఇటీవల జిల్లాకేంద్రంలో డీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అన్ని మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ఓ నియోజకవర్గానికి చెందిన నేతలెవరూ హాజరుకాలేదు. ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత ఆదేశాల మేరకే ఒక్కరు కూడా హాజరుకాలేదని తెలిసింది. సమావేశానికి గైర్హాజరైన పార్టీ నాయకులు సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీచేసినా స్పందించే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ ముఖ్య నేతల మధ్య విభేదాలు, వర్గపోరుతో ఎవరికి వారు ప్రత్యేక సమావేశాలు, కార్యక్రమాలు చేపడుతుండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

‘సర్‌’ ప్రక్రియలో కాంగ్రెస్‌ నేతల

పనితీరుపై అసంతృప్తి

ఆర్మూర్‌ నియోజకవర్గంలో

ఎవరికీ పట్టని ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ

‘డీ’ కేటగిరికి పరిమితం కావడంపై

పార్టీలో చర్చ

పార్టీ సమావేశాలకు ఉద్దేశపూర్వకంగానే డుమ్మాకొడుకున్న నేతలు

పదవులపై కాకుండా పార్టీ బలోపేతంపై

దృష్టిసారించాలని అధిష్టానం సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement