ఉపయోగం.. అప్రమత్తం
● తరగతి గదుల్లో విద్యార్థులకు బోధన, అభ్యా సనకు సంబంధించి అర్థమయ్యే రీతిలో ఉండేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది.
● పాఠ్యాంశాల ప్రణాళిక, ప్రశ్నపత్రాల తయా రీ, వర్క్‌షీట్లు, ప్రజెంటేషన్లు తయారు చేసుకోవచ్చు.
● విద్యార్థుల వ్యక్తిగత అభ్యాస స్థాయికి అనుకూలంగా బోధన పద్ధతులు మెరుగుపర్చుకోవచ్చు.
● సబ్జెక్టుకు అనుగుణంగా ప్రాక్టికల్ వర్క్‌షాపు లు, ప్రాజెక్టుల కోసం ఏఐని ఉపయోగించు కోవచ్చు.
● ఏఐ సాధనాల పరిమితులు, వాటిని అధికంగా ఉపయోగిస్తే వచ్చే దుష్ఫలితాలపై అప్రమత్తం చేసేందుకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఖలీల్‌వాడి : బోధనలో నాణ్యత, వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చి, విద్యార్థుల అభ్యసన ఫలితాలు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఈ కార్యక్రమం జిల్లాలో రెండు విడతలు గా కొనసాగనున్నది. మొదటి దశలో జిల్లాలోని ప లువురు టీచర్లను ఎంపిక చేసి రాష్ట్ర రీసోర్స్ పర్సన్లుగా, వారి ద్వారా జిల్లా రీసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. మండల స్థాయి రీసోర్స్ పర్సన్లకు శిక్షణ అందించనున్నారు. ఈ నెల 31 వరకు జిల్లా స్థాయి, 20 నుంచి 25 వరకు మండల స్థాయిలో శిక్షణ ని ర్వహిస్తున్నారు. రెండో విడత డిజిటల్ లెర్నింగ్‌లో భాగంగా ఆగస్టు మొదటివారంలో శిక్షణ తరగతు లు నిర్వహిస్తారు. శిక్షణ పొందిన టీచర్లు 1,156 స్కూళ్లలో 1 తరగతి నుంచి 9 తరగతి వరకు ఏఐ ద్వారా విద్యార్థులకు తరగతులు చెప్పనున్నారు.
ఇబ్బందులు..
ఏఐపై శిక్షణలో ఉపాధ్యాయులు పలు ఇబ్బందులను చెప్తున్నారు. టీచర్లలో చాలా మందికి ఏఐ టూల్స్, డిజిటల్ ఫ్లాట్‌ఫారాల ఉపయోగంపై అవగాహన లేక ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ బడుల్లో కంప్యూటర్లు, 5జీ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ఏఐ శిక్షణ తీసుకున్నా లాభం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు టీచర్లకు బోధనేతర పనులు అప్పగిస్తుండడంతో ఏఐ శిక్షణపై సమయం కేటాయించడం ఇబ్బందిగా ఉందంటున్నారు. పాఠ్య ప్రణాళిక, ప్రశ్నపత్రాల తయారీ, తరగతి గదిలో ఏఐ వినియోగంపై ప్రత్యక్ష సాధన ఉండాలని కోరుతున్నారు.
టీచర్లకు ఆగస్టు మొదటి వారం వరకు ఏఐపై శిక్షణ అందిస్తాం. తరగతి గదుల్లో విద్యార్థులకు బోధన, అభ్యసన అర్థమయ్యేందుకు ఏఐ శిక్షణ తోడ్పుడుతుంది. దీంతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరిగి ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.
– పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్
ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ
వృత్తి నైపుణ్యం, విద్యార్థుల అభ్యసన
ఫలితాల పెంపుదలే లక్ష్యం
ఏఐ సహకారంతో వర్క్‌షీట్లు,
ప్రశ్నపత్రాల తయారీ


