225 కిలోమీటర్లు..
● హ్యామ్ ద్వారా జిల్లాలోని
పలు రోడ్ల అభివృద్ధికి నిధులు
● మొదటి దశ పనులకు
పూర్తయిన టెండర్లు
హ్యామ్ కింద అభివృద్ధి చెందనున్న మాక్లూర్ మండలం ధర్మోరా – మాందాపూర్ రోడ్డు
నిజామాబాద్‌అర్బన్ : ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మో డ్) పద్ధతిలో జిల్లాలోని పలు రోడ్లకు మహర్దశ రానుంది. పనికి సంబంధించిన మొత్తం ని ధుల్లో ప్రభుత్వం 40శాతం నిధులును ముందు మంజూరు చేయగా, మిగతా 60శాతం నిధులు కాంట్రాక్టర్లు భరించాల్సి ఉంటుంది. ఆ మొ త్తాన్ని కూడా కాంట్రాక్టర్‌లు బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. బిల్లుల కు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఆర్‌బీఐ తో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంకు ద్వారా తీసుకున్న రుణ మొత్తాన్ని కాంట్రాక్టర్ నిర్ణీత వ్యవధిలో చెల్లించడంతోపాటు 15 ఏళ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. మొదటి దశలో జిల్లాలో 225.86 కిలో మీటర్ల రోడ్లను రూ.412 కోట్లతో విస్తరణ, అభివృద్ధి చేయనున్నారు. పనులకు సంబంధించిన నిధులను ప్రభుత్వం కేటాయించగా, టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఒప్పందం ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా 25 ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికను రూపొందించారు.
రోడ్డు కిలోమీటర్లు (దూరం) నిధులు (రూ.కోట్లలో..)
జానకంపేట – నవీపేట – నందిపేట 0 నుంచి 15.50 24.09
జానకంపేట – నవీపేట – నందిపేట 15.50 నుంచి 27.77 16.01
మానిక్ బండార్ – ధర్మారం – చింరాజ్‌పల్లి 0 నుంచి 18.55 27.47
నవీపేట – కళ్యాపూర్ – నీల – కందకుర్తి 0 నుంచి 17.20 19.92
సిరికొండ – వేములవాడ 0 నుంచి 25.30 29.30
కమ్మర్‌పల్లి – భీమ్‌గల్ 0 నుంచి 21 25.04
డిచ్‌పల్లి – నిజామాబాద్ 0 నుంచి 12.40 24.94
నిజామాబాద్ – 44 హైవే (మోపాల్–కులాస్‌పూర్–డిచ్‌పల్లి) 0 నుంచి 18.84 58.14
ఇందల్‌వాయి – భీమ్‌గల్ 0 నుంచి 25 77.02
ఇందల్‌వాయి – భీమ్‌గల్ 13.50 42.16
మల్కాపూర్ – కొల్లూరు – హున్సా – సాలూర 0 నుంచి 11 30.01
మెండోరా క్రాసింగ్ – రుద్రంగి – మానాల 17.50 18.20
పల్లికొండ – దేవక్కపేట రోడ్ – రహత్‌నగర్ 10 11.00
భీమ్‌గల్ – ముచ్కూర్ 5.80 06.72
మోర్తాడ్ – భీమ్‌గల్ 2 02.32
విస్తరణ, అభివృద్ధికి నోచుకోనున్న రోడ్లు ఇవే..


