బాధ్యతలు చేపట్టిన నూతన డీఎఫ్‌వో | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు చేపట్టిన నూతన డీఎఫ్‌వో

Jul 24 2026 1:33 AM | Updated on Jul 24 2026 1:33 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లా అటవీ శాఖ అధి కారి(డీఎఫ్‌వో)గా ప్రశాంత్‌ బాజీరావు పాటి ల్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇది వ రకు పని చేసిన సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌ ఇటీ వల బదిలీపై వెళ్లగా.. ఆయన స్థానంలో ఆదిలాబాద్‌ నుంచి బాజీరావు పాటిల్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీవోలు సుధాకర్‌, చంద్రశేఖర్‌, ఎఫ్‌ఆర్వోలు సంజయ్‌గౌడ్‌, రవిమోహన్‌ భట్‌, పుండలిక్‌, వనిత, నర్సింగ్‌రావు, సిబ్బంది నూతన డీఎఫ్‌వోకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డీఎఫ్‌వో తన చాంబర్‌లో రేంజ్‌ అధికారులతో గంటపాటు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

స్కూళ్లలో డాగ్‌స్క్వాడ్‌ తనిఖీలు

నిజామాబాద్‌ రూరల్‌ : మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం డాగ్‌స్క్వా డ్‌ తనిఖీలు చేపట్టారు. గాంధీనగర్‌ తండా, మల్లారం గ్రామాల్లోని ప్రభుత్వ ప్రభుత్వపాఠశాలలకు డాగ్‌స్క్వాడ్‌తోపాటు పోలీసు సిబ్బంది చేరుకుని తనిఖీలు చేపట్టారు. అనంతరం గంజాయివంటి మత్తు పదార్థా లు తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. లీగల్‌ సెల్‌ సహకారంతో పాఠశాలల్లో తనిఖీలు చేపట్టామన్నారు. అనుమానాస్పద ప్రదేశాల్లో ప్రత్యేకంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు.

25, 26 తేదీల్లో కబడ్డీ అకాడమీ ఎంపికలు

నిజామాబాద్‌ అర్బన్‌ : మహబూబ్‌నగర్‌లోని కబడ్డీ బాలుర అకాడమీలో ప్రవేశాల కోసం ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ కోచ్‌ మీసాల ప్రశాంత్‌ తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఉదయం 7.30 గంటల నుంచి మహబూబ్‌నగర్‌లో ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2020 జూన్‌ 30 నుంచి 2012 జూలై 1 మధ్య జన్మించిన వారై ఉండాలని, ఎత్తు 182 సెంటీ మీటర్లపైబడి ఉండాలని సూచించారు. జనన, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతోపాటు 10 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, ఆధార్‌, స్థానికత ధ్రువపత్రం వెంటతీసుకుని హాజరుకావాలని పేర్కొన్నారు.

సీఎంఆర్‌ ఇవ్వని

రైస్‌మిల్లులపై చర్యలు

నిజామాబాద్‌ రూరల్‌: నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి సీఎంఆర్‌ ఇవ్వని రైస్‌మిల్లులపై చర్యలు తీసుకుంటామని అడిషనల్‌ కలెక్టర్‌ భుజంగరావు పేర్కొన్నారు. ఖానాపూర్‌ శివారులో ఉన్న సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌పై గురువారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. రైస్‌మిల్‌ నుంచి 3,15,970.6 క్వింటాళ్ల సీఎంఆర్‌ ఇవ్వాల్సి ఉండగా, మిల్లులో 1,12,282.40 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే ఉందని, మిగతా బియ్యానికి లెక్కలు లేవని అడిషనల్‌ కలెక్టర్‌ తెలిపారు. నివేదిక ఆధారంగా సదరు రైస్‌మిల్‌పై క్రిమినల్‌ చర్యలు లేదా రికవరీ కోసం ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

నేడు ప్రవచనకర్త

చాగంటి రాక

నిజామాబాద్‌ రూరల్‌: ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో నగర శివారులోని బోర్గాంలో ఉన్న భూమారెడ్డి కన్వెన్షన్‌లో శుక్రవారం నిర్వహించనున్న ‘గోమాత వైభవం’ కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు హాజరుకానున్నారు. చాగంటి రాక సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులతోపాటు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులకు, పోలీసులకు రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement