25వ డివిజన్‌ సమస్యలు పరిష్కరించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

25వ డివిజన్‌ సమస్యలు పరిష్కరించాలని వినతి

Feb 25 2026 7:10 AM | Updated on Feb 25 2026 7:10 AM

25వ డివిజన్‌ సమస్యలు పరిష్కరించాలని వినతి

25వ డివిజన్‌ సమస్యలు పరిష్కరించాలని వినతి

సుభాష్‌నగర్‌: నగరంలోని 25వ డివిజన్‌ కోటగల్లిలో రోడ్లు, డ్రెయినేజీ, ఇతరత్ర సమస్యలు పరిష్కరించాలని డివిజన్‌ ఇన్‌చార్జి అంతరెడ్డి విజయ్‌పాల్‌రెడ్డి కోరారు. ఈమేరకు నుడా చైర్మన్‌ కేశ వేణును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా విజయ్‌పాల్‌రెడ్డి మాట్లాడుతూ డివిజన్‌లో రోడ్లు, డ్రెయినేజీలు సరిగ్గా లేక డివిజన్‌ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నుడా చైర్మన్‌ దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన నుడా చైర్మన్‌ కేశ వేణు డివిజన్‌ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వేముల ప్రసాద్‌, నర్సింగ్‌రావు, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement