ప్రకృతి వ్యవసాయంపై శ్రద్ధ చూపాలి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంపై శ్రద్ధ చూపాలి

Feb 25 2026 7:10 AM | Updated on Feb 25 2026 7:10 AM

ప్రకృతి వ్యవసాయంపై  శ్రద్ధ చూపాలి

ప్రకృతి వ్యవసాయంపై శ్రద్ధ చూపాలి

ప్రకృతి వ్యవసాయంపై శ్రద్ధ చూపాలి

డిచ్‌పల్లి: ప్రకృతి వ్యవసాయంపై రైతులు శ్రద్ధ చూపాలని, అధిక రసాయనిక ఎరువులు వాడకంతో వల్ల భూమి నిస్సారంగా తయారై పంట దిగుబడి తగ్గిపోతుందని రూరల్‌ ఏడీఏ కృష్ణ, డిచ్‌పల్లి మండల వ్యవసాయాధికారి ఆంజనేయులు సూచించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ ఆదేశాల మేరకు మంగళవారం డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లి గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంతో భూమి జీవశక్తి పెరుగుతుందన్నారు. నీటి నిలువ, మట్టి నాణ్యత మెరుగుపడుతుందన్నారు. సేంద్రియ వ్యవసాయానికి జీవ ఎరువులను వాడాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పోతె ప్రభాకర్‌, ఉప సర్పంచ్‌ లొక్కిడి ఆశన్న, ఏఈవో

రూపేష్‌,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement