కమ్యూనిస్టు మహాసభను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టు మహాసభను విజయవంతం చేయాలి

Feb 25 2026 7:10 AM | Updated on Feb 25 2026 7:10 AM

కమ్యూనిస్టు మహాసభను విజయవంతం చేయాలి

కమ్యూనిస్టు మహాసభను విజయవంతం చేయాలి

డిచ్‌పల్లి: కమ్యూనిస్టు పార్టీ ప్రథమ మహాసభకు వందేళ్లు నిండిన సందర్భంగా ఈనెల 27న హైదరాబాదులో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ డిచ్‌పల్లి మండల కార్యదర్శి జేపీ గంగాధర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీఏర్పడి 2026 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుందన్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ మహాసభ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం సుప్రియ, గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు నాయకులు సాంసన్‌, కార్మికులు భారతి, గంగామణి, రాజమణి, సుద్దపల్లి నర్సయ్య, రాజేందర్‌ పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement