చిన్నారి మృతి కారకులను శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

చిన్నారి మృతి కారకులను శిక్షించాలి

Feb 25 2026 7:10 AM | Updated on Feb 25 2026 7:10 AM

చిన్న

చిన్నారి మృతి కారకులను శిక్షించాలి

నిజామాబాద్‌ రూరల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కొమ్మెర మల్లన్న జాతరలో చిన్నారి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌ అన్నారు. ఈసందర్భంగా రజక కులస్తులపై దాడికి నిరసనగా నిజామాబాద్‌ బీసీ సంక్షేమ సంఘం, రజక ఐక్యవేదిక, వీరనారి చాకలి ఐలమ్మ రజక సంఘం, బీసీ ఎస్సీ, ఎస్టీ జేఏసీ, భీమ్‌ ఆర్మీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఽ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో మానవహారం ఏర్పాటు చేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈఘటనకు కారకులైన వారిని ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. బుస్స ఆంజనేయులు, గూపన్‌పల్లి శంకర్‌, భిక్షపతి, సాయిలు, ప్రభాకర్‌, సుమన్‌, పోల్కం గంగాకిషన్‌, దర్శనం దేవేందర్‌, కొయ్యాడ శంకర్‌, బగ్గలి అజయ్‌, సాయి బసవ, చంద్రకాంత్‌, రేఖ, భూమేశ్‌, భూమన్న, వాసం జయ, ప్రేమ్‌ కుమార్‌, మహిపాల్‌, బాలన్న, సురేందర్‌ గంగాధర్‌ శ్రీనివాస్‌ అనిల్‌ తదితరులు పాల్గొన్నారు

దిష్టిబొమ్మ దహనం

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కొమ్మెర మల్లన్న జాతరలో చిన్నారి మృతికి నిరసనగా అగ్రకుల దురహంకార దిష్టిబొమ్మను కల్లు గీత కార్మికులు. వివిధ కులవృత్తుల సభ్యులు జిల్లాకేంద్రంలోని ధర్నాచౌక్‌ వద్ద దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈసందర్భంగా జిల్లా కల్లు గీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. నిందితులపై 302 సెక్షన్‌ ప్రకారం శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోయడ నరసింహులు, జిల్లా కార్యదర్శి సిదుకు శేఖర్‌ గౌడ్‌, రజక వృద్ధార్ల సంఘం బి శ్యాం ప్రసాద్‌, వడ్డెర వృత్తిదారుల సంఘం వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు,ఇడగొట్టి సాయిలు, జిల్లా గౌరవ అధ్యక్షులు పల్లపు వెంకటేష్‌, కార్యదర్శి వడ్డెన్న తదితరులు పాల్గొన్నారు.

దాడి చేయడం అమానుషం

సిరికొండ: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చిన్నారి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బండారి నరేష్‌ మంగళవారం పత్రికా ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జా తరలో కుల వివక్షతో రజక కుటుంబంపై దాడి చే యడం అమానుషమన్నారు. బీసీలకు రాష్ట్ర ప్రభు త్వం అండగా ఉండాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బోర్గాం(పి)లో కొవ్వొత్తుల ర్యాలీ

మోపాల్‌: నగరశివారులోని బోర్గాం(పి) 5వ డివిజన్‌లో నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మౌనిక మరణానికి కారణమైన అగ్రకులస్తులకు వ్యతిరేకంగా రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ యాదాల నరేష్‌, వివిధ సంఘాల నాయకులు, మహిళలు, యువకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

చిన్నారి మృతి కారకులను శిక్షించాలి1
1/2

చిన్నారి మృతి కారకులను శిక్షించాలి

చిన్నారి మృతి కారకులను శిక్షించాలి2
2/2

చిన్నారి మృతి కారకులను శిక్షించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement