కార్పొరేటర్లకు సన్మానం
సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరో డివిజన్ కార్పొరేటర్ గోపిడి స్రవంతి రెడ్డి, 24వ డివిజన్ కార్పొరేటర్ ఇప్పకాయల సుమిత్ర కిషోర్ లను మంగళవారం వినాయక్‌నగర్‌లో శ్రీమహాలక్ష్మీ పద్మశాలి సంఘం(తర్ప నంబర్.46) సభ్యులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బత్తుల ఆశోక్‌కుమార్, గౌరవ అధ్యక్షులు చిలుక జగదీష్, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, కోశాధికారి చాట్ల రవీందర్, ముఖ్యసలహదారులు గుజ్జెటి వెంకట్‌నర్సయ్య, ఉపాధ్యక్షులు బైస కృష్ణ, నారాయణ, బలరాం, సభ్యులు తదితరులున్నారు.


