ముబారక్‌ నగర్‌ కాంప్లెక్స్‌లో టీఎల్‌ఎం మేళా | - | Sakshi
Sakshi News home page

ముబారక్‌ నగర్‌ కాంప్లెక్స్‌లో టీఎల్‌ఎం మేళా

Feb 25 2026 7:10 AM | Updated on Feb 25 2026 7:10 AM

ముబార

ముబారక్‌ నగర్‌ కాంప్లెక్స్‌లో టీఎల్‌ఎం మేళా

ముబారక్‌ నగర్‌ కాంప్లెక్స్‌లో టీఎల్‌ఎం మేళా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌తో క్రమశిక్షణ కొనసాగుతున్న మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన నూతన సంవత్సర పంచాంగం ఆవిష్కరణ

నిజామాబాద్‌ రూరల్‌ : మండల పరిధిలోని ముబారక్‌ నగర్‌ కాంప్లెక్స్‌లో మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఉమ్మడి మండలాలకు సంబంధించిన తెలుగు ఉపాధ్యాయుల టీఎల్‌ఎం మేళాను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్‌ ప్రధాన ఉపాధ్యాయులు హన్మంత్‌రావు మాట్లాడుతూ.. బోధన అభ్యసన కార్యక్రమంలో టీఎల్‌ఎం గొప్పగా ఉపయోగపడుతుందన్నారు. తరగతి గదిని ఆకర్షణీయంగా నిర్వహించడానికి బోధన ఉపకరణాలు ప్రభావంతం చేస్తాయన్నారు.కాంప్లెక్స్‌ కార్యదర్శి డాక్టర్‌ కాసర్ల నరేశ్‌రావు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు సూచనల మేరకు రెండు మండలాల్లో ఉన్న తెలుగు ఉపాధ్యాయులు గతనెలలో తెలుగు బోధనోపకరణాలను తీసుకువచ్చారన్నారు.కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు నరేంద్రమూర్తి, అబ్బయ్య, డాక్టర్‌ సుంకరి గంగాధర్‌, రాంప్రసాద్‌,దేవన్న, కై లాస్‌ స్వర్ణ సమత, లలిత, పర్లి కృష్ణవేణి,రాజేశ్వరి, విజయ, మంజుల,వినోద అరుంధతి, తదితరులు పాల్గొన్నారు

ఖలీల్‌వాడి : భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ వ్యవస్థాపకులు రాబర్ట్‌ స్మిత్‌ లార్డ్‌ బెడెన్‌ పావెల్‌ జయంతి సందర్భంగా నగరంలోని రాధాకృష్ణ పాఠశాలలో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జెండాను యోగా రాంచందర్‌, స్కూల్‌ కార్యదర్శి సీహెచ్‌ నారాయణలు మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం రాబర్ట్‌ స్మిత్‌ లార్డ్‌ బెడెన్‌ పావెల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌తో క్రమశిక్షణ,సమయపాలన,సేవాభావం కలిగి ఉంటారన్నారు.స్కౌ ట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కోశాధికారి, పాఠశాల స్కౌట్‌ మాస్టర్‌ మిట్టపల్లి రాజులు, హెచ్‌ఎం అనిత, సీహెచ్‌ సునీత, యాంటీ నార్కోటిక్‌ డ్రగ్స్‌ సీఐ పూర్ణేశ్వర్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ రూరల్‌: మండలంలోని ఖానా పూర్‌ ఒకటో డివిజన్‌లో మల్లికార్జున స్వామి వి గ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు కొనసాగుతున్నా యి. ఈసందర్భంగా మంగళవారం నూతన విగ్రహాలకు దేవతాపూజ, గణపతి, శివ, రుద్ర నమకచమక, శ్రీసూక్త, పంచసుక్తనవగ్రహ, స ర్వదేవతల హోమం నిర్వహించారు. ఈ విగ్ర హ ప్రతిష్ఠాపన కార్యక్రమం పలుగుట్ట స్వామి మంగిరాములు మహరాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణయాదవ సంఘం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.

నిజామాబాద్‌ రూరల్‌: ప్రముఖ వేద పండితులు పంచాంగ కర్త జిల్లా కేంద్రానికి చెందిన యల్లాప్రగడ చంద్రశేఖర శర్మ పరాభవ నామ సంవత్సరం పంచాంగంను బాసర శ్రీ లలిత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేసి వేద పండితులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంచాంగ కర్త శర్మ మాట్లాడారు. వేలేటి రాజేంద్ర శర్మ. రామ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ముబారక్‌ నగర్‌ కాంప్లెక్స్‌లో టీఎల్‌ఎం మేళా 
1
1/3

ముబారక్‌ నగర్‌ కాంప్లెక్స్‌లో టీఎల్‌ఎం మేళా

ముబారక్‌ నగర్‌ కాంప్లెక్స్‌లో టీఎల్‌ఎం మేళా 
2
2/3

ముబారక్‌ నగర్‌ కాంప్లెక్స్‌లో టీఎల్‌ఎం మేళా

ముబారక్‌ నగర్‌ కాంప్లెక్స్‌లో టీఎల్‌ఎం మేళా 
3
3/3

ముబారక్‌ నగర్‌ కాంప్లెక్స్‌లో టీఎల్‌ఎం మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement