విద్యార్థులకు లెక్కలు చెప్పిన సీపీ
రుద్రూర్: కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య ఉపాధ్యాయుడి పాత్ర పోషించి విద్యార్థులకు అంకెలు నేర్పారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్‌నగర్ ప్రాథమిక పా ఠశాలను సోమవారం ఆయన సందర్శించా రు. చిన్నారులతో ముచ్చటిస్తూ వారికి గణితంపై ఆసక్తి పెంపొందేలా పాఠం చెప్పారు. గణితం ప్రతి రోజు మనకు ఉపయోగపడుతుందని, వస్తువుల కొనుగోలు, సమయం అంచనా వేయడం లాంటివాటిని ఉదహరించారు. చేతి వేళ్ల ఆధారంగా 1 నుంచి 10 వ రకు అంకెలను సులభంగా గుర్తుపెట్టుకునే విధానాన్ని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఫొటో దిగారు.
డిమాండ్‌కు అనుగుణంగా నిరంతర విద్యుత్
● ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ
పీవీ రాజేశ్వర్‌రావు
సుభాష్‌నగర్: ఎన్‌పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ డిమాండ్ గతేడాది మార్చిలో 5,816 మెగావాట్లు ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరి 21 నాటికి 5,904 మెగావాట్లకు చేరిందని నిజామాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పీవీ రాజేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిలో పీక్ డిమాండ్ ఎంత పెరిగినా దానికి అనుగుణంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో లోడ్ పెరుగుదల అంచనాల మేరకు ఓవర్ లోడ్ అవుతున్న 152 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచామన్నారు. అదనంగా 104 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంతోపాటు 17 చోట్ల పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను బిగించామని తెలిపారు. జిల్లాలో 15 కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, అవసరమైన ప్రాంతాల్లో 78 కొత్త బ్రేకర్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరా నాణ్యత మెరుగుపర్చేందుకు 33/11 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్లను సిద్ధం చేశామన్నారు.
లైసెన్స్‌డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్లు
నిజామాబాద్ అర్బన్: శిక్షణ పూర్తి చేసుకున్న 46 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం కలెక్టరేట్‌లో సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ ఇప్పించి, వారి సేవలను వినియోగించుకునేలా చర్యలు తీసుకుందన్నారు. దీ నిని దృష్టిలో పెట్టుకుని సర్వేయర్లు బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు. అవినీతి ఆరోపణలకు తావులేకుండా నిజాయితీగా సర్వే నివేదికలు సమర్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిర ణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, సర్వే అండ్‌ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని సీపీ కార్యాలయంలో సో మవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో సీపీ సాయి చైతన్య 30 ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి బాధితులు సీపీ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను విన్నవించారు. తక్షణమే ఈ సమ స్యలు పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు సీపీ ఆదేశించారు.
విద్యార్థులకు లెక్కలు చెప్పిన సీపీ
విద్యార్థులకు లెక్కలు చెప్పిన సీపీ


