శంకుస్థాపనలు | - | Sakshi
Sakshi News home page

శంకుస్థాపనలు

Feb 6 2026 7:27 AM | Updated on Feb 6 2026 7:27 AM

శంకుస

శంకుస్థాపనలు

జిల్లా అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులను ప్రకటించనున్న సీఎం

రూ.20 కోట్లతో టీయూలో నిర్మించిన సైన్స్‌ భవన ప్రారంభోత్సవం

నగరం చుట్టూ ఔటర్‌ రింగ్‌రోడ్డు కోసం రూ.2 వేల కోట్లతో ప్రతిపాదనలు

గుండారం వద్ద 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ జోన్‌కు ప్రతిపాదనలు

నిజామాబాద్‌ స్మార్ట్‌ సిటీకి ప్రతిపాదనలు పంపించాం

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ‘సాక్షి’ ఇంటర్వ్యూలో

రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి

రూ.687 కోట్ల

పనులకు

జిల్లాల పర్యటనల్లో భాగంగా ముఖ్యమంత్రి వస్తున్నారు. రూరల్‌ నియోజకవర్గంలోని కేశాపూర్‌ వద్ద నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొంటారు. రూ.600 కోట్లతో నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లకు సీఎం శంకుస్థాపనలు చేస్తారు. అదేవిధంగా టీయూలో రూ.10 కోట్లతో ఇంజినీరింగ్‌ కళాశాల భవనం, రూ.18 కోట్లతో ఆడిటోరియం, రూ.17 కోట్లతో అడ్మిన్‌ భవనం, రూ.10 కోట్లతో బాలికల హాస్టల్‌, రూ.10 కోట్లతో ఎస్టీ బాలుర హాస్టల్‌, రూ.10 కోట్లతో ఎస్టీ బాలికల హాస్టల్స్‌ నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా రూ.12 కోట్లతో నిర్మించనున్న ఏకలవ్య పాఠశాల క్వార్టర్స్‌, మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే టీయూలో నిర్మాణం పూర్తి చేసుకున్న సైన్స్‌ భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు.

రూ.10 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.2 కోట్లు పాఠశాలల అభివృద్ధికి, రూ.కోటి తాగునీటికి, మిగిలిన రూ.7 కోట్లు కమ్యూనిటీ భవనాలకు, రోడ్ల పనులకు ఖర్చు చేశాం. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండా నుంచి మండల కేంద్రానికి డబుల్‌ రోడ్డు కనెక్టివిటీ, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు నాలుగు లేన్‌ల రోడ్డు కోసం కృషి చేస్తున్నాం. మరోవైపు ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కింద డ్రెయిన్‌ల కోసం రూ.10 కోట్లతో, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద రోడ్ల కోసం రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ఇందల్వాయి వద్ద హైవే పక్కన రోడ్డుప్రమాదాల సమయంలో అత్యవసర వైద్యసేవల కోసం ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రక్రియ నడుస్తోంది.

నిజామాబాద్‌ నగరంతోపాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో పాగా వేస్తాం. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా మా ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ముందుకెళ్తోంది. నిజామాబాద్‌ స్మార్ట్‌ సిటీకి ప్రతిపాదనలు పంపాం. నగరంలో రూ.10 కోట్లతో క్రీడల కాంప్లెక్స్‌, 10 ఎకరాల్లో పార్క్‌, ఎలక్ట్రిక్‌ బస్‌ డిపో కోసం కృషి చేస్తున్నాం.

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పూర్తి విధ్వంసం జరిగింది. గడీల పాలన నడిచింది. కాంగ్రెస్‌ పాలన వచ్చాక అన్ని వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నాం. దీంతో సర్పంచ్‌ ఎన్నికల్లోనూ ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధిస్తాం. బీజేపీ, ఎంఐఎంలు మతాల పేరిట రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజలు వీటిని గమనించాలి.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా రూ.687 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని, అదేవిధంగా రూ.20 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న తెలంగాణ వర్సిటీలోని సైన్స్‌ బిల్డింగ్‌ను ఆయన ప్రారంభిస్తారని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌.భూపతిరెడ్డి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో భూపతిరెడ్డి గురువారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో కొత్త రోడ్లు, వంతెనల కోసం ఆర్‌అండ్‌బీ మంత్రి ద్వారా రూ.150 కోట్లు మంజూరయ్యాయి. వీటికి టెండర్లు పూర్తయ్యాయి. మరిన్ని రోడ్లు, వంతెనల కోసం రూ.250 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. అలాగే పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రోడ్లకు మరో రూ.200 కోట్లు తీసుకొచ్చా. రోడ్ల మరమ్మతుల నిర్వహణకు మరో రూ.10 కోట్లు మంజూరు చేయించా.

ప్రాణహిత–చేవెళ్ల 21ఏ ప్యాకేజీ పనులను త్వరలో పూర్తి చేసి 1.82 లక్షల ఎకరాలకు నీరందిస్తాం. మోపాల్‌, గుండారం బస్‌ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపించాం. తిర్మన్‌పల్లి, తాటిపల్లి, న్యాల్‌కల్‌, డీబీ తండా వద్ద 33/11 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల కోసం రూ.12 కోట్లు మంజూరయ్యాయి. కేశ్‌పల్లి, హుస్సేన్‌నగర్‌, సుద్దులం వద్ద విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపగా మంజూరయ్యాయి. జక్రాన్‌పల్లి, ధర్పల్లి వద్ద 133/33 సబ్‌ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపాం. మరోవైపు రైతుల సౌకర్యం కోసం డిచ్‌పల్లి, ధర్పల్లి వద్ద సర్వీస్‌ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపాం.

జిల్లాకు ఇప్పటికే వ్యవసాయ కళాశాల సైతం మంజూరైంది. నిజామాబాద్‌ నగరం చుట్టూ రూ.2వేల కోట్ల అంచనాతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించేందుకు, డిచ్‌పల్లి వద్ద డ్రైపోర్ట్‌ ఏర్పాటుకు, గుండారం వద్ద 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ జోన్‌ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేశాం. అలాగే నిజామాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌ సైతం మార్చేందుకు ప్రతిపాదనలు చేశాం. ప్రాణహిత–చేవెళ్ల పథకం కింద 21ఏ ప్యాకేజీ పనులను పాత డిజైన్‌ మేరకు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం.

శంకుస్థాపనలు1
1/1

శంకుస్థాపనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement