సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● అధికారులతో కలెక్టర్, సీపీ సమీక్ష
000000
(ఫొటోనం.254,255–250035
నిజామాబాద్ అర్బన్: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కోసం ఈ నెల 6న రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైత న్య, జిల్లా అధికారులు, సీఎంవో కార్యాలయ భద్ర తా విభాగం అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. డిచ్‌పల్లి మండలం బర్దీపూర్ శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి, హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్ తదితర ప్రాంతాలను సందర్శించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సీఎం సభకు విద్యుత్ అంతరాయం తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, సభకు హాజరయ్యే వారికి తాగునీరు వంటి వసతులు కల్పిస్తూ, ప్రథమ చికిత్స సదుపాయం, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాగా, సీఎం భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సాయి చైతన్య పోలీసు అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, సీఎంవో కార్యాలయ భద్రతా అధికారి మాధవరావు, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, ప్రకాశ్, మస్తాన్ అలీ, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు


