పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు | - | Sakshi
Sakshi News home page

పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు

Feb 6 2026 7:27 AM | Updated on Feb 6 2026 7:27 AM

పోటీల

పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు

సుభాష్‌నగర్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బరిలో బంధువులు పోటీ పడుతున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్క డివిజన్‌లో.. ఒకే పార్టీ నుంచి పలు డివిజన్లలో.. కొందరు ఒకటే డివిజన్‌లో బరిలో నిలిచారు. వీరిలో గతంలో గెలిచిన వారు ఉండగా, మరికొందరు మొదటిసారిగా పోటీలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఎక్కువగా కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చారు.

● నిజామాబాద్‌ నగరంలోని 8వ డివిజన్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి దండు చంద్రశేఖర్‌ పోటీ చేస్తుండగా, ఆయన కుమార్తె డాక్టర్‌ దండు రుషిత 21వ డివిజన్‌లో అదే పార్టీ నుంచి బరిలో నిలిచారు. దండు చంద్రశేఖర్‌ గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. కాగా దండు చంద్రశేఖర్‌ భార్య దండు నీతూకిరణ్‌ తాజా మాజీ నిజామాబాద్‌ నగర మేయర్‌గా ఉన్నారు. తండ్రి, కుమార్తె ఒకే పార్టీ నుంచి వేర్వేరు డివిజన్లలో బరిలో నిలిచారు.

● నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 28వ డివిజన్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి రంగు సీతారాం బరిలో ఉండగా, ఆయన భార్య రంగు అపర్ణ 50వ డివిజన్‌లో అదే పార్టీ నుంచి పోటీపడుతున్నారు. భార్యభర్తలిద్దరూ ఒకే పార్టీ నుంచి వేర్వేరు డివిజన్లలో పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రంగు అపర్ణ గతంలో కార్పొరేటర్‌గా పని చేశారు.

● నిజామాబాద్‌ నగరంలోని 47వ డివిజన్‌లో సొంత అన్నదమ్ములు పోటీ పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఉల్లెంగ భూపతి పోటీ చేస్తున్నాడు. అదే డివిజన్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన తమ్ముడు ఉల్లెంగ నాగరాజు బరిలో ఉన్నాడు. నాగరాజుకు బ్యాట్‌ గుర్తును కేటాయించారు.

● నిజామాబాద్‌ కార్పొరేషన్‌లోని 7వ డివిజన్‌లో ఆకుల పాపయ్య సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన కుమార్తె ఆకుల అరుణ 24వ డివిజన్‌లో సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ అభ్యర్థిగా మొదటిసారి పోటీ చేస్తున్నారు. తండ్రి, కుమార్తె ఒకే పార్టీ నుంచి వేర్వేరు డివిజన్లలో పోటీలో ఉన్నారు. పాపయ్య గతంలో కౌన్సిలర్‌, కార్పొరేటర్‌గా పని చేశారు.

● నిజామాబాద్‌ నగరంలోని 43వ డివిజన్‌లో ఎర్రం గంగాధర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో నిలవగా, ఆయన అన్న కుమారుడు ఎర్రం సుధీర్‌ 35వ డివిజన్‌లో బీజేపీ నుంచి పోటీలో ఉన్నాడు. ఎర్రం సుధీర్‌ అదే డివిజన్‌లో తాజా మాజీ కార్పొరేటర్‌. బాబాయ్‌, కుమారుడు వేర్వేరు డివిజన్లలో వేర్వేరు పార్టీల నుంచి బరిలో నిలిచారు.

పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు1
1/6

పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు

పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు2
2/6

పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు

పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు3
3/6

పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు

పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు4
4/6

పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు

పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు5
5/6

పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు

పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు6
6/6

పోటీలో బంధువులు.. రక్త సంబంధీకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement