బీజేపీది డైవర్షన్ పాలిట్రిక్స్
మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదు..
● దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష
● అనుచిత వ్యాఖ్యలపై పవన్
వివరణ ఇవ్వాలి
● టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
నిజామాబాద్ రూరల్: ఓటు బ్యాంకు లేక బీజేపీ డైవర్షన్ పాలిట్రిక్స్ చేస్తోందని, ఆ పార్టీ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్ విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఎందుకు వివక్ష చూపుతుందని ప్రశ్నించారు. 12 ఏళ్లుగా ఇక్కడి బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు రాగానే కులం, మతం పేరిట చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ అని, ప్రజల మనోభావాలని ఎన్నికలకు వాడుకునే దుర్నీతి ఆ పార్టీ నేతలకు ఉందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తర్వాతే తెలంగాణలో అడుగుపెట్టాలని హితవుపలికారు.
నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. 19వ వార్డు అభ్యర్థి శమంత నరేందర్ రెడ్డి రూ.8 కోట్ల ము న్సిపల్ ట్యాక్స్ కట్టడం మంచిదేనన్నారు. నిజా మాబాద్ కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రె స్ జెండా ఎగురుతుందన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, అగ్రికల్చర్ క ళాశాలలు, రోడ్ల నిర్మాణానికి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని వివరించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, ను డా చైర్మన్ కేశ వేణు, మాజీ ఎమ్మెల్యే ఆకుల ల లిత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీపీ సీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, దాసరి నర్సింలు, విఫుల్‌గౌడ్, కైసర్, నరేందర్‌సింగ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


