
సేంద్రియ సాగు వైపు మొగ్గుచూపాలి
నిజామాబాద్ సిటీ : రసాయన ఎరువుల వాడకాన్ని బాగా తగ్గించి సేంద్రియ పద్ధతులను అవలంబించి ఆరోగ్యకరమైన పంటలు పండించాలని రైతులకు పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు. జిల్లాకేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రైతు మహోత్సవం కొనసాగుతుండగా, రెండో రోజైన సోమవారం మహేశ్‌కుమార్ గౌడ్ ము ఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో రోజురోజుకు వస్తున్న కొత్త పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రై తు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవగాహన కోసం రైతులను వియత్నాం, మలే షియా వంటి దేశాలకు స్టడీ టూర్‌లకు తీసుకెళ్లాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
రైతులు మూస విధానాలకు స్వస్తి పలికి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, పంట మార్పిడి విధానాలను అవలంబించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులతో మమేకం కావాలన్నా రు. యువత వ్యవసాయంలోకి రావాలని, ఉద్యోగా ల కోసం దిగులు చెందొద్దని పేర్కొన్నారు. భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తే ఎకరాకు రూ.40 వేలవరకు సంపాదించొచ్చని సూ చించా రు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, వినయ్‌రెడ్డి, నగేశ్‌రెడ్డి, అగ్గుభోజన్న తదితరులు పాల్గొన్నారు.