వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలి
● ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్
నిజామాబాద్‌అర్బన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వక్ఫ్ బిల్లు ముస్లిం సమాజాన్ని అణచివేయడానికి దోహదపడుతుందన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో బైక్ ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. వక్ఫ్ బోర్డు నూతన బిల్లుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. సమావేశంలో వక్ఫ్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.


