అమాత్యా.. పురపాలికపై కరుణ చూపరూ?
మోర్తాడ్ : భీమ్‌గల్ పట్టణానికి రాష్ట్ర ప్రొహిబిషన్, ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు(బుధవారం) రానున్నారు. పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పట్టణంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారిస్తారా అనే విషయంపై పుర ప్రజలు చర్చించుకుంటున్నారు. పట్టణాభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు.
● మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని వార్డుల్లో మురికి కాలువల సౌకర్యం లేకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది.
● పున:ప్రారంభమైన బస్సు డిపోలో బస్సులు, అధికారులు, ఉద్యోగులను కేటాయించకపోవడంతో కాగితాలకే పరిమితమైంది.
● 100 పడకల ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించి మూడేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాలేదు. త్వరగా అందుబాటులోకి తీసుకొస్తే మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
● విద్యుత్ లైన్ కొత్తది వేసి సరఫరాలో లోపాలను సరిదిద్దాలి.
● తహసీల్దార్ భవనం కూల్చి ఆ స్థలాన్ని మార్కె ట్ కోసం కేటాయించారు. మార్కెట్ స్థలంలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో రోడ్లపైనే కొనసాగుతోంది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. ఇలా ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్న భీమ్‌గల్ పట్టణంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల సమస్యలు
నేడు భీమ్‌గల్‌కు
మంత్రి జూపల్లి కృష్ణారావు రాక
పట్టణాభివృద్ధిపై దృష్టి
సారించాలని ప్రజల వేడుకోలు
సమస్యల పరిష్కారానికి
ఎదురుచూపులు


