చిన్నారి ప్రాణాలు బలిగొన్న కూలర్‌ | - | Sakshi
Sakshi News home page

చిన్నారి ప్రాణాలు బలిగొన్న కూలర్‌

May 20 2024 8:25 AM | Updated on May 20 2024 12:36 PM

చిన్నారి ప్రాణాలు బలిగొన్న కూలర్‌

చిన్నారి ప్రాణాలు బలిగొన్న కూలర్‌

పెర్కిట్‌(ఆర్మూర్‌): వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారిని కూలర్‌ బలితీసుకుంది. ఈ ఘటన ఆర్మూర్‌ పట్టణంలోని పెర్కిట్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్‌లో నివసించే దీపిక, వినీత్‌ దంపతులకు ఆరేళ్ల కూతురు శృతిక ఉంది. 

ఎండాకాలం సెలవులు రావడంతో శృతిక పెర్కిట్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. శనివారం రాత్రి అమ్మమ్మ వంట పనుల్లో నిమగ్నమై ఉండగా శృతిక ఆడుకుంటూ ఇనుప కూలర్‌ వద్దకు వెళ్లి, దానిని తాకింది. కూలర్‌కు విద్యుత్‌ ప్రసారం కావడంతో శృతిక విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. అప్పటివరకు ఆడుకుంటూ సరదాగా గడిపిన చిన్నారి అంతలోనే విగత జీవిగా మారడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement