
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన చార్వీకి పుట్టుకతోనే వినికిడి లోపంతో పాటు, మాటలు రావు. ఈ చిన్నా రికి సదరం సర్టి ఫికెట్ లభిస్తేనే దివ్యాంగుల పింఛన్‌తో పాటు ఇతర పథకాల్లో లబ్ధి చేకూరుతుంది. సదరం సర్టిఫికెట్ కోసం బాలిక తండ్రి రమేశ్ రెండుమూడేళ్లుగా తిప్పలు పడుతున్నా డు. ఇటీవల సదరం క్యాంపు కోసం స్లాట్ బుక్ చేయించారు. కానీ నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వినికిడి లోపం ఉన్న వారికి ప్రాథమికంగా పరీక్ష చేసే ఆడియో మెట్రి మిషన్ పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు. సర్టిఫికెట్ కోసం మరోసారి స్లాట్ బుక్ చేసుకుని హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో హైదరాబాద్ వెళ్లక తప్ప ని పరిస్థితి నెలకొంది. ఇలా.. ఒక్క చార్వీకి ఎదురవుతున్న సమస్యే కాదు. ఇలా ఎంతో మంది బాధితులు సదరం సర్టిఫికెట్ కోసం అవస్థలు పడుతున్నారు.
నిజామాబాద్ ఆస్పత్రిలో ఉన్న ఆడియో మెట్రి యంత్రం రెండేళ్ల క్రితం చెడిపోగా బాగు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వినికిడి లోపం ఉన్న వారు సదరం సర్టిఫికెట్ కోసం హైదరాబాద్ వెళ్లి పరీక్షలు చేయించుకుని వస్తేనే నిజామాబాద్‌లో సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. వినికిడి లోపం ఉన్నవారికి ప్రతినెలా కేవలం 15లోపు స్లాట్లను కేటాయిస్తున్నారు. ఇందులోనే రెన్యూవల్ చేసుకునే వారికి స్లాట్‌లు ఉంచారు. అసలే స్లాట్‌లు లేకపోవడం, సర్టిఫికెట్ల కోసం నిజామాబాద్, హైదరాబాద్‌లకు తిరుగుతూ ఎంతో మంది పేద, మధ్య తరగతి కుటుంబాల వారు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మిషన్‌ను బాగుచేయించి అందుబాటులోకి తీసుకువచ్చి ఇబ్బందులు తప్పేలా చూడాలని దివ్యాంగులు కోరుతున్నారు.
చెడిపోయిన ఆడియో మెట్రి మిషన్
వినికిడి లోపం ఉన్న వారు
హైదరాబాద్‌కు వెళ్లాల్సిందే..

చార్వీ