18 వేల అడుగుల ఎత్తులో.. మైనస్‌ 38 డిగ్రీల టెంపరేచర్‌లో.. | - | Sakshi
Sakshi News home page

18 వేల అడుగుల ఎత్తులో.. మైనస్‌ 38 డిగ్రీల టెంపరేచర్‌లో..

Feb 22 2024 1:14 AM | Updated on Feb 22 2024 10:05 AM

- - Sakshi

షాదుల్‌

నిజామాబాద్‌: ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ షాదుల్‌ ఎత్తైన మంచు పర్వతంపై తన స్వగ్రామం పేరును ప్రదర్శించి మమకారం చాటుకున్నారు. షాదుల్‌ రెండ్రోజులుగా జమ్మూకశ్మీర్‌లోని లదాఖ్‌లో గల 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతంపై మైనస్‌ 38 డిగ్రీల టెంపరేచర్‌లో ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా స్వగ్రామం అన్నాసాగర్‌ పేరుతో ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. గ్రామస్తులు షాదుల్‌ను అభినందించారు.

ఇవి చదవండి: ఎట్టకేలకు ‘రూట్‌’ క్లియర్‌!

Advertisement
 
Advertisement
Advertisement