రెబ్బెన: క్రీడాకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపెల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం గోలేటి టౌన్షిప్ లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా అండర్–19 బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 22 నుండి 24 వరకు హన్మకొండ జిల్లా కమలాపురంలో జరిగే అంతర్‌జిల్లాల పోటీల్లో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు భాస్కర్, సంయుక్త కార్యదర్శి హరిలాల్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎంపికై న క్రీడాకారులు
అండర్ 19 బాలుర జట్టుకు ప్రేమ్‌దీప్, గోపాలక్రిష్ణ, నిఖిల్, రాఘవ, ప్రజ్ఞశీల్, మారుతీ, అంజనేయులు, వెంకటసాయినాథ్ రెడ్డి, భానుప్రసాద్, కృష్ణ లోకానంద్, స్టీఫెన్, అనిల్, బాలిక జట్టుకు రిషిత, సిరి, సాద్వీ, సౌమ్య, శ్రీలక్ష్మీదేవి, సహస్రా, శివానీ, శ్రావ్య, షైనీ, మల్లీశ్వరీ, శివాత్మిక, సంకీర్తన ఎంపికయ్యారు.


