మందమర్రిరూరల్: పట్టణంలోని కృష్ణవేణి హైస్కూల్ గ్రౌండ్స్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అండర్ 17 బాలబాలికల జోనల్ స్థాయి నెట్‌బాల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. బాలుర విభాగంలో మంచిర్యాల జట్టు విన్నర్ కాగా ఆసిఫాబాద్ జట్టు రన్నర్‌గా నిలిచింది. బాలికల విభాగంలో ఆసిఫాబాద్ జట్టు విన్నర్ కాగా ఆదిలాబాద్ జట్టు రన్నర్‌గా నిలిచింది. గెలుపొందిన జట్లకు మందమర్రి సీఐ రమేశ్, ఎస్సై నరేష్, నిర్వాహకులు యాకూబ్, రాం వేణు, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్‌రెడ్డి ట్రోఫీ, ప్రశంసాపత్రాలు అందజేశారు.


