నిర్మల్‌టౌన్: అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందించాలనే సంకల్పంతో నిర్మల్‌లోని అఖిలభారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కేరళలోని శబరిమల సమీపంలోని నారాయణ తోడ్ గ్రామంలో 60 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 16 నుంచి జనవరి 20 వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని గ్రామ సభ్యుడు రితీష్ మోన్, శబరిమల రవాణా శాఖ మాజీ నోడల్ అధికారి సునీల్ బాబు ప్రారంభించారు. పలువురు మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి వచ్చి శబరిమల సమీపంలో అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. సభ్యులు రాజేందర్ గౌడ్, ప్రకాష్, ఆనంద్, మారుతి, జ్యోతిర్మయి పాల్గొన్నారు.


