మంచిర్యాలఅర్బన్: స్థానిక బాయ్స్ ఉన్నత పాఠశాల మైదానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ ఎంపిక పోటీలు శుక్రవారం నిర్వహించారు. పోటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీవీ రామన్ కళాశాలకు చెందిన కృష్ణ, జీఎస్కే రెడ్డి, సాత్విక్, సింహాద్రి, హురైయ్, ఇజాన్, రెహమాన్, ఆకాశ్, చరణ్, సాయివర్మ, మిమ్స్ కళాశాలకు చెందిన సిద్ధార్థ, రాఘవ, బెల్లంపల్లి డిగ్రీ కళాశాలకు చెందిన శ్రీకాంత్, నిఖిల్, ఉట్నూర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పవన్, ఆకాశ్, వాగ్ధేవి డిగ్రీ కళాశాలకు చెందిన చరణ్, వీవీడీసీ కళాశాలకు చెందిన రాకేశ్ ఎంపికయ్యారు. వీరు ఈ నెల 10, 11, 12 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్న పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపిక ప్రక్రియలో పీడీలు నూనె శ్రీనివాస్, కె.శ్రీనివాస్, ప్రశాంత్, శ్రీనివాస్, రమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


