సత్ప్రవర్తనతో మెలగాలి | - | Sakshi
Sakshi News home page

సత్ప్రవర్తనతో మెలగాలి

Nov 6 2026 11:42 PM | Updated on Nov 6 2026 11:42 PM

ఆదిలాబాద్‌టౌన్‌: నేర ప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సూచించారు. గురువారం అర్ధరాత్రి ఆదిలాబాద్‌ పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లతో పాటు కోలిపుర, రవీంద్రనగర్‌, చిల్కూరిలక్ష్మీనగర్‌ ప్రాంతాల్లోని రౌడీషీటర్ల ఇళ్లను తనిఖీ చేశారు. వారి ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహారాలు, గత నేర చరిత్రకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు సునీల్‌కుమార్‌, నాగరాజు, ఎస్సై నాగనాథ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement