ఆదివాసీల ఐక్యతకు ప్రతీక దండారీ | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల ఐక్యతకు ప్రతీక దండారీ

Nov 6 2026 11:42 PM | Updated on Nov 6 2026 11:42 PM

ఇంద్రవెల్లి: ఆదివాసీల ఐక్యతకు దండారీ ప్రతీకగా నిలుస్తుందని ఎంపీ గోడం నగేశ్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కోయాల్‌పాండ్రి, మారుతిగూడ గ్రామాల్లో నిర్వహించిన దండారీ ఉత్సవాలకు హాజరయ్యారు. ఎంపీకి ఆదివాసీలు సంప్రదాయ వాయిద్యాలు, గుస్సాడీ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. 2015లో న్యూఢిల్లీలో గుస్సాడీ నృత్య ప్రదర్శన నిర్వహించడం, కనకరాజుకు పద్మశ్రీ లభించడంతో ఆదివాసీ సంస్కృతికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. మాజీ జెడ్పీటీసీ ఆర్క పుష్పలత, బీజేపీ నాయకులు జాదవ్‌ సుమన్‌బాయి, సర్పంచులు కోవ రాజేశ్వర్‌, మెస్రం తుకారాం, కొరెంగా సుంగు, రాందాస్‌, నాయకులు ఆర్క ఖమ్ము, ఆరెల్లి రాజలింగు, ఆదివాసీ పెద్దలు గేడం యేశ్వంత్‌రావ్‌, పుర్క చిత్రు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement