నర్సాపూర్(జి): మండలంలోని నసీరాబాద్ గ్రామ 61వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా పట్టణానికి చెందిన ఎస్కే మునీర్ (38) ద్విచక్ర వాహనంపై నిర్మల్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో నసీరాబాద్ గ్రామ 61వ జాతీయ రహదారిపై అదే వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో మునీర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను ఉద్గిరి ప్రీతం నిర్మల్ వాసిగా గుర్తించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.


