నిర్మల్‌టౌన్: పట్టణంలోని బాగులవాడ శ్రీసరస్వతీ శిశుమందిర్ పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు నిరంజన్‌రెడ్డి సోమవారం సాయంత్రం సందర్శించారు. పాఠశాలలోని మౌలిక వసతులు, అభివృద్ధి పనుల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విద్యాసంస్థల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యం కీలకమన్నారు. సిర్గాపూర్‌లో శ్రీ సరస్వతీ శిశు మందిర్ సీబీఎస్‌ఈ పాఠశాల ఏర్పాటుకు నాలుగు ఎకరాల స్థలం కేటాయించారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, పాఠశాల అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ, కార్యదర్శి ఆయన్నగారి శ్రీకాంత్, సహ కార్యదర్శి అయిట్ల ప్రవీణ్, ఉపాధ్యక్షుడు అదుముల్ల నరేంద్ర, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


