బతుకమ్మ ఆడుతున్న ఎస్పీ జానకీషర్మిల, జిల్లా జడ్జి శ్రీవాణి, మహిళా పోలీసులు
పోలీస్ అంటే మనకు చేతిలో లాఠీ.. భుజానికి తుపాకీ.. గాంభీర్యమైన ఆహార్యం గుర్తొస్తాయి. పోలీసులు కూడా పండుగలు, సంస్కృతి, సంప్రదాయాల్లో భాగస్వాములవుతున్నారు. మొన్న వినాయక నిమజ్జన వేడుకలు, నిన్న గంగనీళ్ల జాతరలో జిల్లా పోలీసులు విధులు నిర్వహిస్తూనే వేడుకల్లో జనంతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. తాజాగా పోలీసు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో జిల్లా మహిళా పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ ఆడారు. డీజే పాటలకు స్టెప్పులేశారు. జిల్లా జడ్జి శ్రీవాణి, ఎస్పీ జానకీషర్మిల ముఖ్య అతిథులుగా హాజరై మహిళా పోలీసులతో కలిసి బతుకమ్మ ఆడారు. అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. – నిర్మల్టౌన్


