వేడుకలకు అన్నీ సిద్ధం | - | Sakshi
Sakshi News home page

వేడుకలకు అన్నీ సిద్ధం

Oct 20 2026 4:37 AM | Updated on Oct 20 2026 4:37 AM

బంగల్‌పేట్‌ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఏటా జరగనున్న దసరా వేడుకలకు అన్ని సిద్ధం చేశాం. విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, రావణ దహన కార్యక్రమం నిర్వహిస్తాం. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం. అధిక సంఖ్యలో భక్తులు వేడుకలకు హాజరు కావాలి.

– మూర్తి ప్రభాకర్‌, వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి

ఏర్పాట్లు పూర్తి చేశాం

దసరా వేడుకలకు మహాలక్ష్మి ఆలయనికి వచ్చే భక్తులకు మున్సిపల్‌ ఆధ్వర్యంలో వసతులు కల్పించాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆలయం పక్కన గల గ్రౌండ్‌ చదును చేశాం. వాటర్‌, కరెంట్‌ సౌకర్యం కల్పించాం. టెంట్లు, బారికేడ్లు, వేదిక సిద్ధం చేశాం. వినాయక సాగర్‌ వద్ద దుర్గామాత నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేశాం.

– రవిబాబు, మున్సిపల్‌ కమిషనర్‌, నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement